ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా టీడీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే టీవీ5 చానెల్ యాంకర్ సాంబశివరావు ఈసారి మాత్రం సీఎం చంద్రబాబుకే బహిరంగంగా హితబోధ చేశారు.
తన కార్యక్రమం వేదికగా సాంబశివరావు గారు స్పష్టంగా చెప్పారు —
కొంతమంది పారిశ్రామికవేత్తలు, అవకాశవాద నేతలు అధికారంలో ఉన్నప్పుడు బాబు చుట్టూ తిరిగి లబ్ధిపొందుతున్నారని, కానీ నిజంగా పార్టీ కోసం, కష్టకాలంలో పోరాడిన కార్యకర్తలకు మాత్రం గుర్తింపు రాకపోవడం తగదని.. వారిని పక్కనబెట్టి, కేవలం స్వార్థపరులను చుట్టూ ఉంచుకుంటే పార్టీకి దెబ్బతింటుందని హెచ్చరించారు.
సాంబశివరావు వ్యాఖ్యలతో టీడీపీ వర్గాల్లో చర్చలు ముదురుతున్నాయి. ఇంత ధైర్యంగా బాబుకు సలహా ఇచ్చే సాంబశివరావును కొందరు “టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేస్తే బాగుండదు?” అంటూ వ్యంగ్యంగా, మరికొందరు నిజంగానే ఆలోచనగా మాట్లాడుతున్నారు.
తాజా వ్యాఖ్యలతో టీవీ5 సాంబశివరావు వాయిస్ వింటుంటే,
“మళ్ళీ అధికారం మీద టీడీపీ ఆశలు తగ్గిపోతున్నాయా?” అనే సందేహాలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
అయితే సాంబశివరావు చెప్పిన మాటల్లో కొంత వాస్తవం ఉన్నట్టే అనిపిస్తోంది. పార్టీని నిలబెట్టేది కార్యకర్తలే, కానీ అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ తిరిగే లబ్ధిదారులు కాదు!
మొత్తానికి, టీవీ5 సాంబశివరావు హితబోధ ఇప్పుడు టీడీపీ కేడర్, నాయకత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఇక చూడాలి… చంద్రబాబు ఈ సూచనలను ఎంతవరకు సీరియస్‌గా తీసుకుంటారో!

