ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వేడి వాతావరణం నెలకొంది. కూటమి వర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ అన్నట్టుగా పరిణామాలు సాగుతున్న వేళ, జనసేన పార్టీ చుట్టూ జరుగుతున్న సంఘటనలు అనుమానాలకు తావిస్తున్నాయి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలు, అధికార ప్రతినిధి కన్నా రజిని వ్యాఖ్యలు, సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ రాజీనామా ప్రకటన ఇవి వరుసగా జరగడం రాజకీయ వ్యూహమనే అనుమానాలను పెంచుతోంది.
గతంలో ప్రజారాజ్యం పార్టీ ఎదుర్కొన్న పరిస్థితులే ఇప్పుడు జనసేనకూ పునరావృతమవుతున్నాయా అన్న చర్చ సాగుతోంది. ఆరోపణలపై న్యాయపరమైన విచారణ జరగాల్సిన వేళ, వాటిని రాజకీయంగా మలచే ప్రయత్నాలు కనిపిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే కూటమిలోని తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ తో సమన్వయ సమావేశం జరగడం కొంత ఉపశమనం కలిగించే అంశం. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో జనసేన ఎలా స్పందిస్తుందో, రాజకీయ కుట్రల ఆరోపణలకు ఎలా తెరదించుతుందో చూడాలి.


