ఏపీలో కుల రాజకీయాల వేడి మరోసారి రాజుకుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో, జనసేన మహిళా అధికార ప్రతినిధి కన్నా రజిని గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ టీవీ ఇంటర్వ్యూలో కాపు కులానికి సంబంధించిన వ్యాఖ్యలు చేస్తూ ఆమె చేసిన మాటలు వివాదాస్పదంగా మారాయి. చాలా రోజుల కిందట చేసిన వ్యాఖ్యలైనా, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అవి మళ్లీ హైలెట్ కావడం గమనార్హం.
ఇటీవల అంబటి అరెస్టుపై స్పందించిన కన్నా రజిని, ప్రజాస్వామ్యంలో దాడులు ఎవరుచేసినా తప్పేనని అన్నారు. ఈ వివాదం టీడీపీ–వైసీపీ మధ్యేనని, జనసేన పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. పోలీసులు ఉండగానే దాడులు జరగడం సరికాదని, పోలీస్ వ్యవస్థపై అధికార పార్టీ ప్రభావం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు పార్టీ లైన్‌కు విరుద్ధమని జనసేన వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో, ఆమెపై చర్యలు ఉండవచ్చన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

