Top Stories

జగన్ తో ఫైట్.. షర్మిలకు సూటి ప్రశ్నలు..

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంపకానికి సంబంధించి షర్మిల చేస్తున్న అనవసరపు యాగీ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యూకే కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్తి వివాదంలో జగన్ పై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్న షర్మిలకు ఆయనకున్న ప్రశ్నలను సంధించారు. జగన్ తన మోసం చేశాడు అంటున్న షర్మిల ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన సంధించిన ప్రశ్నలు ఇవే.

* తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి అయితే సోదరుడితో ఎంవోయూ చేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది. వారసత్వంగా తాత, తండ్రుల నుంచి వచ్చిన ఆస్తి అయితే నేరుగా కోర్టుకు వెళ్లి తేల్చుకుంటే సరిపోతుంది కదా. దస్తావేజులు కూడా ఉంటాయి కాబట్టి జగన్ మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏముంది. కానీ, ఎంవోయూ చేసుకున్నారు అంటే అన్న దగ్గర నుంచి పొందుతున్నారనే కదా. ఈ ఎంఓయు కూడా 31 ఆగస్టు 2019 లో చేసుకున్నారు. పెళ్లి జరిగిన 19 ఏళ్ల తర్వాత, వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన పదేళ్ల తర్వాత ఈ ఎంఓయు జరిగింది. తాత, తండ్రుల నుంచి వచ్చిన ఆస్తి అయితే ఇన్నేళ్లపాటు ఒప్పందం చేసుకోవడానికి ఎందుకు సమయం పట్టిందో చెప్పాలి.

* చెల్లి, తల్లి మీద ఫిర్యాదు చేశారంట గగోలు పెడుతున్నారు మీరు ఎంఓయు ఎందుకు చేసుకున్నట్టు. ఎంఓయు కూడా న్యాయపరమైన పత్రమే కదా. ఆస్తికోసం అప్పట్లో మీ అన్నను ఎంవోయూ చేసుకోమని మీరు అడిగారంటే అది కూడా లీగల్ గా నిలబడాలనే కదా. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేయడం వెనక ఉన్న కారణం మీకు తెలియదా. మీకు ముందుగా చెప్పి చూసినా ప్రయోజనం లేకపోయిన తర్వాతే ఆయన కేసు వేసిన విషయం మర్చిపోయారా. తనను తాను రక్షించుకునేందుకు కేసు కొడితే తప్పు ఎలా అవుతుందో చెప్పాలి.

* తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి చెబుతున్న మీరు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి పెట్టిన కంపెనీలో పనిచేశారా. ఆ కంపెనీలు కోసం తీసుకున్న రుణాల్లో మీ పేరు ఉందా.? నష్టాలు వస్తే ఎప్పుడైనా భరించారా.? సమాధానం చెప్పాలి.

* వైయస్ రాజశేఖర్ రెడ్డి నుంచి వారసత్వంగా లభించిన ఆస్తి అయితే ఈడి, సిబిఐ పెట్టిన కేసుల వ్యవహారంలో ఆయన ఒక్కరే ఎందుకు జైలుకు వెళ్లినట్లు. మీరు కూడా జైలుకు వెళ్లాలి కదా. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి అయితే ఆ కేసుల్లో మీ పేరు కూడా ఉండాలి కదా మరి ఎందుకు లేనట్టు.

* 2019లో ఎంవోయూ చేసుకున్నప్పుడు ఆయా ఆస్తుల పేర్లను బదిలీ చేయకూడదు అన్న విషయం షర్మిలకి చెప్పారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులని ఈడీ, సీబీఐ అటాచ్మెంట్ లో ఉన్నాయి. కేసు విచారణలో ఉండగా ఆ ఆస్తులను బదిలీ చేస్తే న్యాయపరంగా జగన్మోహన్ రెడ్డి చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐదేళ్లు షేర్లు బదిలీ చేయకుండా ఉన్న మీరు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు. ఈ బదలాయింపు గనుక ఉన్న మీ ఉద్దేశం ఏమిటో బయటకు చెప్పండి.

* అన్న మోసం చేశాడంటూ గగ్గోలు పెడుతున్న మీరు అన్నకు ఏమైనా మంచి చేశారా. రోడ్డు ఎక్కి మరి దుర్భాషలాడుతున్నారు. నానా యాగి చేసి ఆయనను బదనాం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రేమతో ఆయన ఆస్తి ఇవ్వాల్సిన అవసరం ఏముంది. మీ ఇద్దరి మధ్య ప్రేమే లేనప్పుడు ఎంఓయు వెనక్కి తీసుకునే హక్కు కూడా జగన్ మోహన్ రెడ్డికి ఉంది. చంద్రబాబుతో కలుస్తాను, పచ్చ మీడియాలో కూర్చుంటాను అంటే ఆయన ఎందుకు సైలెంట్ గా చూస్తూ ఉండాలి.

* చివరిగా ఒక సోదరిగా ఎంత ఇబ్బంది పెట్టకూడదు అంతకంటే ఎక్కువగానే జగన్మోహన్ రెడ్డిని మీరు ఇబ్బందులకు గురి చేశారు. విజయమ్మకు కూడా అసలు విషయం చెప్పకుండా ఆమెను మీరు మాయలో పెడుతున్నారు. ఈ వ్యవహారం అంతటికి సూత్రధారి బ్రదర్ అనిల్ కుమార్. ఈ విషయంలో ఎక్కువగా మాట్లాడాలని చూస్తే తమ దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాటిని బయట పెడతాం. అన్నయ్యతో కయ్యానికి కాలు దువ్వుతూ అన్నయ్య ప్రేమతో ఇచ్చిన ఆస్తి మాత్రం కావాలి అనడం ఎంత వరకు సమంజసం. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి పై మాట్లాడాలని డాక్టర్ చింత స్పష్టం చేశారు.

Trending today

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

Topics

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

పో పోవయ్యా ‘బాబు’

ఎమ్మెల్యేలు మాత్రమే కాదు... ఏకంగా మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

దువ్వాడ మరో సంచలనం

వైసీపీ నుంచి బహిష్కృతుడైన దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలతో మరోసారి సంచలనం...

Related Articles

Popular Categories