తప్పుడు థంబ్‌నెయిల్స్‌తో ఆడబిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నాడంటూ సోషల్ మీడియాలో మహా న్యూస్ ఎండీ, ‘టాల్కం పౌడర్ వంశీ’పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “నీకు సారీ చెప్పాలా… బొమ్మ అవుతావు జాగ్రత్త!” అంటూ నేరుగా సవాలు విసురుతూ తెలుగు ప్రజానీకానికి అసలు ముందు నువ్వే సారీ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
కేటీఆర్‌తో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్, టిక్‌టాక్‌లో ఫేమస్ అయిన ఉప్పల్ బాలు, కామెడీ డ్యాన్స్ చేసే గోపీ అంకుల్ కూడా సారీ చెప్పాలా నీకు అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. “నువ్వే పెద్ద పాపం చేసావ్… పైగా నీకు సారీ కేటీఆర్ చెప్పాలా?” అంటూ నిలదీస్తున్నారు.
“నీవు పెట్టిన స్క్రీన్ షాట్‌లు శాశ్వతాలు! ఇప్పుడు డిలీట్ చేస్తే ఏం? భవిష్యత్తులో దొరికితే… “రియాక్షన్ వీడియోలు” ఖాయం!” అని హెచ్చరిస్తున్నారు. ఎవరికీ అధికారం శాశ్వతం కాదని, వంశీని సమర్థించేవాళ్లు రేపు కుర్చీ కోల్పోతే అతని పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. చివరకు వంశీనే థంబ్‌నెయిల్‌గా మిగిలిపోతాడని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదని, రాబోయే రోజుల్లో న్యూస్‌ను న్యూస్‌గా ప్రజెంట్ చేయాలని, వాస్తవాలు చెప్పకపోయినా ఫర్వాలేదు కానీ వ్యక్తిగత విషయాల జోలికి పోకుండా ఉంటే మంచిదని హితవు పలుకుతున్నారు. “సారీ” కోరే అర్హతే వంశీకి లేదని స్పష్టం చేస్తూ, “ఒకటే అడ్వైస్ టాల్కం తగ్గించు వంశీ… న్యాయమే నీ దూల తొలగించే నిజమైన పౌడర్!” పూసుకొని తరించాలని సూచించారు.