Top Stories

పెద్దారెడ్డి అరెస్ట్

తాడిపత్రిలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పెద్దారెడ్డి ఈరోజు తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయగా, ఈ సమావేశానికి భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చాయి.

పెద్దారెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు సమావేశానికి హాజరయ్యారు. తమ స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి బయలుదేరిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రిలో భారీగా మోహరించిన పోలీసులు, వైఎస్సార్‌సీపీ సమావేశానికి అనుమతి ఉన్నప్పటికీ, పెద్దారెడ్డికి మాత్రం అనుమతి లేదని తెలిపారు. దీంతో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. పెద్దారెడ్డి మినహా మిగిలిన వైఎస్సార్‌సీపీ నాయకులు సమావేశానికి హాజరుకావచ్చని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

తనపై పోలీసులు ఆంక్షలు విధించడంపై కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో ఉండేందుకు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, పోలీసులు తనను అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నన్ను చూసి భయపడుతున్నారు. అందుకే పోలీసుల ద్వారా నన్ను అడ్డుకుంటున్నారని” ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పోలీసులు జేసీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో తిమ్మంపల్లి గ్రామం నుంచి తాడిపత్రి వరకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Trending today

అలేఖ్య చిట్టీకి బిగ్ బాస్ రాలేదు.. వేధింపులు

  తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించిన కంచర్ల సోదరీమణులు...

వైఎస్ షర్మిల కుమారుడు రాజకీయం వైపు..?

రాజకీయాల్లో మరోసారి వైఎస్ కుటుంబం నుంచి కొత్త వారసుడు రంగప్రవేశం చేయనున్నట్లు...

చంద్రబాబు లోటు పూడ్చే పనిలో లోకేష్

  తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యూహాల్లో రాయలసీమ కీలక ప్రాంతంగా మారింది. గత...

అయ్యగారు అయిపోయిన టీవీ5 సాంబశివ

  ఎప్పుడూ పొలిటికల్ డిస్కషన్‌ల్లోనే కనిపించే టీవీ5 యాంకర్ సాంబశివరావు ఈసారి భిన్నంగా...

ఆర్కే కొత్త పలుకు.. ఒకే విషయానికి రెండు తూకాలు?

తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను ఆంధ్రజ్యోతి ఎమ్‌.డి. వేమూరి రాధాకృష్ణ తన...

Topics

జగన్ ముందుచూపుని మెచ్చుకున్న చంద్రబాబు

రాష్ట్ర రాజకీయాల్లో అరుదైన సందర్భం చోటుచేసుకుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

బిగ్ బాస్ 9 ప్రారంభంకే హంగామా.. కంటెస్టెంట్ కే షాక్!

బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 9’ గ్రాండ్ లాంచ్...

పవన్‌ను ‘నంబర్ 1 క్రిమినల్’ అన్న మహా వంశీ

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది. ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్‌...

Related Articles

Popular Categories