బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 9’ గ్రాండ్ లాంచ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈసారి హౌస్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వారిలో భరణి శంకర్, జబర్దస్త్ ఇమ్మానుయేల్, సుమన్ శెట్టి, రాము రాథోడ్, తనూజ గౌడ, రీతూ చౌదరి, ఆశా షైనీ, సంజన గల్రాని వంటి సెలబ్రిటీలు ఉండగా, సామాన్యుల వైపు నుంచి ఆర్మీ పవన్ కళ్యాణ్, దమ్ము శ్రీజ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నారు.
అయితే, ప్రోమోలో సస్పెన్స్ క్రియేట్ చేసిన మరో కంటెస్టెంట్ చేతిలో బాక్స్‌తో నాగార్జున ముందు వచ్చి, ఇది తన శరీర భాగమని, హౌస్‌లోకి తీసుకెళ్లేందుకు అనుమతి కావాలని కోరాడు. కానీ బిగ్ బాస్ అనుమతించలేదు. దాంతో అతను “అయితే నేను ఇంటికి వెళ్తాను” అని వెనక్కి తిరిగిపోయాడు. నాగార్జున కూడా “నువ్వు బయటకి వెళ్లవచ్చు కానీ హౌస్ లోపలకి మాత్రం కాదు” అని చెప్పడంతో సస్పెన్స్ మరింత పెరిగింది.
ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరు? రాము రాథోడ్‌నా లేదా ఇంకెవరైనా? అతను నిజంగానే వెనక్కి వెళ్లిపోయాడా లేక మళ్లీ హౌస్‌లోకి వస్తాడా అనేది తెలుసుకోవాలంటే ఈ సాయంత్రం ప్రసారమయ్యే గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ వరకూ వేచి చూడాల్సిందే.