Top Stories

తట్టుకోలేకపోయిన ఏబీఎన్ వెంకటకృష్ణ

కర్నూలులో జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య స్నేహపూర్వక క్షణాలు.. కౌగిలింతలు, హిందీలో ప్రశంసలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ అంశంపైనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌లో జరిగిన డిబేట్‌లో ఆసక్తికరమైన వాదనలతో వాతావరణం వేడెక్కింది.

డిబేట్‌లో పాల్గొన్న కమ్యూనిస్టు నేత గఫూర్ వ్యాఖ్యలు అయితే సూటిగా, సెటైర్‌తో నిండిపోయాయి. “ఇంత పొగడ్తలు, కౌగిలింతలు అవసరమా? నాయకత్వం అంటే విమర్శనాత్మక దృష్టి ఉండాలి కానీ, అతి ప్రశంసలు కాదు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆయన మరింతగా మాట్లాడుతూ “ట్రంప్ & మోదీ ఎలా కౌగిలింతలు చేసుకొని పొగుడుకొన్నారో తెలుసుకదా?” అని వ్యంగ్యంగా అన్నారు.

దీనికి ప్రతిగా యాంకర్ వెంకటకృష్ణ స్పందిస్తూ, “రాష్ట్రం ప్రయోజనాల కోణంలో చూస్తే చంద్రబాబు ప్రధాని మోదీని పొగడడం తప్పు కాదు. రాష్ట్రం కోసం మంచి సంబంధాలు కొనసాగించాల్సిందే” అని అన్నారు. అయితే చివర్లో ఆయన కూడా ఒప్పుకున్నట్టుగా “పొగడ్తల డోస్ కొంచం ఎక్కువైంది” అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కొందరు నెటిజన్లు వెంకటకృష్ణ వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, మరికొందరు “మీడియా కూడా ఇప్పుడు నాయకుల పొగడ్తల పరిమితి గురించి చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది” అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

మొత్తం మీద, కర్నూలు సభలోని ఆ మోదీ–చంద్రబాబు కౌగిలింతలు కేవలం రాజకీయ క్షణాలకే పరిమితం కాలేక, ఇప్పుడు మీడియా స్టూడియోలలో, సోషల్ మీడియాలో కొత్త వాదనలకు దారితీశాయి.

https://x.com/Samotimes2026/status/1978834147473825927

Trending today

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

Topics

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

Related Articles

Popular Categories