రాష్ట్ర రాజకీయాల్లో అరుదైన సందర్భం చోటుచేసుకుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలనలో నిర్మితమైన రుషికొండ భవనాలపై ప్రశంసలు కురిపించారు.
విశాఖపట్నం రుషికొండలోని నిర్మాణాలను స్వయంగా పరిశీలించిన చంద్రబాబు, తక్కువ ఖర్చుతో జపాన్ టెక్నాలజీ ద్వారా నాణ్యంగా నిర్మించారని అభినందించారు. “ఇది విజన్ అంటే ఇదే. చాలా తక్కువ వ్యయంతో ఇంత గొప్ప స్థాయిలో నిర్మాణాలు చేపట్టడం అభినందనీయం. జగన్ ముందుచూపుకు సలాం” అంటూ వ్యాఖ్యానించారు.
చరిత్రలో రాజులు, బ్రిటిష్ నిర్మించిన కట్టడాలు ఇప్పటికీ నిలిచి ప్రజలకు ఉపాధి, దేశానికి ఆదాయాన్ని ఇస్తున్నట్లు గుర్తుచేసిన ఆయన, రుషికొండ భవనాలు కూడా భవిష్యత్తులో రాష్ట్రానికి విలువైన ఆస్తులుగా నిలుస్తాయని పేర్కొన్నారు.
జగన్ హయాంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, కరోనా సమయంలో తీసుకున్న చర్యలు, అభివృద్ధి దిశలో చూపిన కృషిని చంద్రబాబు గుర్తుచేసి మెచ్చుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.