గుంటూరు కలెక్టరేట్ వద్ద ఓ ఎనిమిదేళ్ల బాలుడు వెక్కివెక్కి ఏడ్చిన తీరు అక్కడి వారందరినీ కదిలించింది. తన కుటుంబానికి జీవనాధారమైన టిఫిన్ బండిని అధికారులు కాలువలో పడేశారని, తమను బతకనివ్వడం లేదని ఆ చిన్నారి కన్నీళ్లతో గోడు వెళ్లబోసుకున్నాడు.
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తమ తల్లి టిఫిన్ బండి పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకునేవారని, అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తమ బండిని తొలగించారని బాలుడు యశ్వంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. “ఇది మంచి ప్రభుత్వం కాదు.. మధ్యతరగతి ప్రజలను ఏడిపించే ప్రభుత్వం” అంటూ ఆవేదనతో మాట్లాడాడు.
యశ్వంత్ తండ్రి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నప్పటికీ, వారి కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని తెలిపాడు. తనకు ఆరోగ్యం సరిగా లేదని, వైద్యం కోసం తన తల్లి టిఫిన్ బండి పెట్టుకుని ఎంతో కష్టపడుతోందని కన్నీళ్లతో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ బండిని కూడా తొలగించడంతో తమ పరిస్థితి ఏమిటని ఆ చిన్నారి దిగులు చెందాడు.
ఈ పరిస్థితిపై జిల్లా కలెక్టర్ స్పందించి, తమ తల్లికి టిఫిన్ బండి పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని యశ్వంత్ విజ్ఞప్తి చేశాడు. “ఈ బాలుడి కన్నీటి కష్టం నీకు కనిపించడం లేదా చంద్రబాబు?” అని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నట్లు ఈ దృశ్యం కనిపించింది. ఓ చిన్నారి ఆవేదనకు అధికారులు, ప్రభుత్వం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
వీడియో కోసం క్లిక్ చేయండి