తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను ఆంధ్రజ్యోతి ఎమ్.డి. వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకు సంపాదకీయంలో మరోసారి ఎకరువు పెట్టారు. కేసీఆర్ కుటుంబంలో కవిత, హరీష్, కేటీఆర్, సంతోష్‌ల మధ్య జరుగుతున్న విభేదాలను రంగరించి రాసిన ఆర్కే, “దోచుకున్న సొమ్ములో పంపకాల తేడాల వల్లే ఈ కలహాలు” అన్న ఆరోపణలా వ్యాఖ్యానించారు.
కానీ, ఇదే పరిస్థితి చంద్రబాబు కుటుంబంలో ఎదురైతే కూడా ఆర్కే ఇంత స్వేచ్ఛగా రాసేవారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. చంద్రబాబు మీద కేసులు వచ్చినప్పుడు కక్షపూరితం అని వాదించిన రాధాకృష్ణ, ఇప్పుడు కేసీఆర్ మీద మాత్రం కఠినంగా రాయడమే ఎందుకని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ నాయకుల ఒడిదొడుకులు ఎవరికి అయినా సహజమేనని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ జర్నలిజంలో ఒకే విషయానికి రెండు తూకాలు వేయడం సరికాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.