Top Stories

టీవీ5 సాంబ ఆన్ ఫైర్

వరంగల్‌ రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు, తీరుతెన్నులపై టీవీ5 యాంకర్‌ సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ5లో ప్రసారమైన చర్చా కార్యక్రమంలో సాంబశివరావు ఘాటుగా మాట్లాడారు.

మాజీ హీరో నాగార్జున ఫ్యామిలీపై గతంలో సురేఖ దారుణ వ్యాఖ్యలు చేసిందని ఆయన గుర్తు చేశారు. అదే ధోరణిలో ఆమె ఇప్పుడు పార్టీ సహచరులపై కూడా ప్రవర్తిస్తోందని విమర్శించారు.

వరంగల్ కాంగ్రెస్ కార్యకర్తలంతా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వద్దకు వెళ్లి “సురేఖను భరించలేకపోతున్నాం” అని ఫిర్యాదు చేసినట్టు సాంబశివరావు వెల్లడించారు. ఆదివాసీ మహిళా మంత్రి సీతక్కను కూడా సురేఖ వేధిస్తోందని ఆయన ఆరోపించారు.

సాంబశివరావు మాటల్లో — “కులం పంచాయితీలు పెడుతూ, కొండా సురేఖ – కొండా మురళి ఝులం ప్రదర్శిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకే నష్టం” అని వ్యాఖ్యానించారు.

అయితే, ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. కొంతమంది నెటిజన్లు సాంబశివరావును విమర్శిస్తూ, “నీ భజన ఛానళ్లతో బీసీ మహిళా మంత్రిని ఎటాక్ చేయిస్తున్నావ్ కదా?” అంటూ ట్రోల్స్, మీమ్స్‌తో దాడి చేస్తున్నారు.

ఇక కొందరు మాత్రం సాంబశివరావుకు మద్దతుగా మాట్లాడుతూ, “సత్యం చెప్పినవారిని ఇలాగే విమర్శిస్తారు” అని కామెంట్లు చేస్తున్నారు.

ఈ వివాదంతో టీవీ5లోని చర్చా వేదిక మళ్లీ రాజకీయ వేడి కేంద్రంగా మారింది. ఒకవైపు మంత్రి సురేఖ – పార్టీ అంతర్గత విభేదాలు, మరోవైపు మీడియా రగడ… వరంగల్‌ కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి.

https://x.com/Nallabalu1/status/1978827458901078177

Trending today

వంశీ ‘మహా’ ఆవేదన

మహా టీవీ యాంకర్ మహా వంశీ తాజాగా తన చానెల్ లైవ్‌లో...

ఏబీఎన్ వెంకటకృష్ణ బాగా హర్ట్ అయినట్టున్నాడు..

జాతీయ మీడియా చానెల్ రిపబ్లిక్ టీవీలో ఎడిటర్ అర్నాబ్ గోస్వామి ఇటీవల...

పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ...

వైసీపీ దాడి.. డిఫెన్స్ లో ‘కూటమి’

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. ప్రధాన ప్రతిపక్షం వై.ఎస్.ఆర్....

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

Topics

వంశీ ‘మహా’ ఆవేదన

మహా టీవీ యాంకర్ మహా వంశీ తాజాగా తన చానెల్ లైవ్‌లో...

ఏబీఎన్ వెంకటకృష్ణ బాగా హర్ట్ అయినట్టున్నాడు..

జాతీయ మీడియా చానెల్ రిపబ్లిక్ టీవీలో ఎడిటర్ అర్నాబ్ గోస్వామి ఇటీవల...

పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ...

వైసీపీ దాడి.. డిఫెన్స్ లో ‘కూటమి’

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. ప్రధాన ప్రతిపక్షం వై.ఎస్.ఆర్....

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

Related Articles

Popular Categories