చంద్రబాబు దయ వల్ల 31st ధావత్ అంటే ఇట్లుంటదీ.. వైరల్ వీడియో

చంద్రబాబు దయ వల్ల ఏపీలో క్వాలిటీ లిక్కర్ అందుతోంది. ఇంకేముందు ఈ 31st కి ఏపీ మందు బాబులు పండుగ చేసుకున్నారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఓ మందుబాబు చేసిన పనికి ఏపీలో లిక్కర్ ఎంతలా పారుతుందో అర్థమైంది. చంద్రబాబు సర్కార్ మద్య ప్రవాహం ఏరేంజ్ లో ఉందో ఈ ఒక్క వీడియోతో బయటపడింది. సర్కార్ పరువు గంగలో కలిసిపోయింది.

పూటుగా మద్యం సేవించాడు. ఆ మత్తులో వెళ్లి విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఏకంగా విద్యుత్ వైర్లపై పడుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. హైరానా పడ్డారు. కానీ ఆయనకు ఏం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం సింగుపురం లో వెలుగు చూసింది ఈ ఘటన. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో. గ్రామానికి చెందిన ఎజ్జల వెంకన్నకు మద్యం తాగే అలవాటు ఉంది. షాపు వద్దకు వెళ్లి మద్యం సేవించాడు. అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. నేరుగా విద్యుత్ స్తంభం వద్దకు వెళ్లాడు. మత్తులో ఉండడంతో అక్కడ స్తంభాన్ని ఎక్కేశాడు. మీద హై టెన్షన్ విద్యుత్ వైర్లపై పడుకున్నాడు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

అసలు వెంకన్న విద్యుత్ స్తంభం ఎందుకు ఎక్కాడో ఎవరికీ తెలియదు. దీంతో స్థానికులు హుటాహుటిన విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వెంకన్నను కిందకు దించేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన అంగీకరించలేదు. కిందకు దిగేందుకు మొండికేశాడు. కొద్దిసేపు స్థానికులు బతిమలాడడంతో కిందకు దిగాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందని ఆరా తీస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

షాపు వద్ద మద్యం తాగి ఇంటికి వెళ్ళాడు వెంకన్న. మళ్లీ మందు కోసం డబ్బులు ఇవ్వమని తల్లిని అడిగాడు. ఆమె నిరాకరించడంతో ఆ కోపంలో వెళ్లి విద్యుత్ స్తంభం ఎక్కి వైర్లపై పడుకున్నాడు. అయితే ఆ సమయానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేకుంటే పరిస్థితి మరోలా ఉండేది. మొత్తానికి చంద్రబాబు దయ వల్ల ఏపీలో మద్యం ఏరులై పారుతోంది. క్వాలిటీ మద్యంతో మందుబాబులు ఇలా నానా రచ్చ చేస్తూ కూటమి ప్రభుత్వం పరువు గంగలో కలిపేస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి