వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఇద్దరు ఎమ్మెల్సీలు తిరిగి పార్టీలో చేరేందుకు ఎదురుచూస్తున్నారు. వీరిద్దరూ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై అమితమైన అభిమానంతో ఉన్నారు. ఎప్పటికైనా తిరిగి వైసీపీ గూటికి చేరతామనే ఆశతో ఉన్నారు.
రంపచోడవరం ఎమ్మెల్సీ అనంతబాబు ఓ కేసులో ఆయనను వైసీపీ సస్పెండ్ చేసింది. అయినప్పటికీ, ఆయన ఇప్పటికీ వైసీపీనే తన పార్టీగా భావిస్తూ, తిరిగి యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం కారణంగా సస్పెండ్ అయ్యారు. తన ప్రేయసితో కలిసి ఉండటమే ఆయనకు పార్టీ నుంచి వేటు కారణమైంది. అయినప్పటికీ, ఆయన కూడా వైసీపీలోకి తిరిగి రావాలని ఆశిస్తున్నారు.
ఇద్దరి మధ్య ఒకే సామ్యమేమిటంటే — అధినేత జగన్ పట్ల అపారమైన విశ్వాసం. “జగన్ పిలిస్తే వెంటనే వస్తాం” అంటున్న ఈ ఇద్దరు నేతలు 2029 ఎన్నికల సమయానికి పిలుపు వస్తుందనే నమ్మకంతో ఎదురుచూస్తున్నారు.
మరి జగన్ వీరిని తిరిగి గూటికి తీసుకుంటారా? లేక వీరిని దూరంగానే ఉంచుతారా? అన్నది చూడాలి.