Top Stories

టీడీపీని ఉతికి ఆరేసింది

మెడికల్ కాలేజీల వ్యవహారంలో టీడీపీ, పచ్చ మీడియా చేస్తున్న దుష్ప్రచారానికి చెంప చెల్లుమనేలా సమాధానం లభించింది. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కట్టిన కొత్త మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) తాజాగా 60 పీజీ సీట్లను కేటాయించడం, పచ్చ ప్రాపగాండాను పూర్తిగా తిప్పికొట్టింది.

వైసీపీ అధికార ప్రతినిధి నాగ మల్లేశ్వరి మాట్లాడుతూ
“జగన్ గారు మెడికల్ కాలేజీలు కట్టలేదు అని టీడీపీ నేతలు, పచ్చ మీడియా ఎడా పెడా మాట్లాడారు. కానీ కాలేజీలు లేనట్లయితే NMC పీజీ సీట్లు ఎలా కేటాయిస్తుంది? ఇదే నిజానికి సమాధానం” అని అన్నారు.

మల్లేశ్వరి మండిపడుతూ “కూటమి ప్రభుత్వం గొంతులో ఎలక్కాయ పడింది. జీవో లేదు, కాలేజీ లేదు, ఏఐ వీడియోలతో ప్రజలను మోసం చేయాలని చూశారు. కానీ ఇప్పుడు వాస్తవం బయటపడింది. జగన్ ప్రభుత్వం నిర్మించిన కాలేజీలకు NMC సీట్లు కేటాయించడంతో వారి అబద్ధాలు బట్టబయలయ్యాయి” అని ధ్వజమెత్తారు.

జగన్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు మెడికల్ ఎడ్యుకేషన్ చేరేలా, ప్రతి జిల్లాలో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. వాటిలో పలు కాలేజీలు ఇప్పటికే పనిచేస్తుండగా, మరికొన్ని తుది దశలో ఉన్నాయి.

వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు “కాలేజీలు లేవన్న టీడీపీ, ఎల్లో మీడియా ఇప్పుడు జగన్ నిర్మించిన కాలేజీలకే NMC సీట్లు ఎందుకు ఇచ్చిందో సమాధానం చెప్పాలి.”

ప్రజల ఆరోగ్యం, విద్యా అవకాశాల కోసం జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు మరోసారి సాక్ష్యాలతో రుజువయ్యాయి. పచ్చ మాఫియా దుష్ప్రచారానికి ఇది బలమైన చెక్ అని వైసీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

https://x.com/JaganannaCNCTS/status/1980552942563541257

Trending today

పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావ్?

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని భవానీపురంలో ఇటీవల ఇళ్ల కూల్చివేతల...

భళా ‘బాబు’

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయనే అంశం తాజాగా...

ఏందీ ‘బాబు’ ఇదీ

భవానీపురంలో 42 ఫ్లాట్లు కూల్చివేయబడటంతో రోడ్డున పడిన బాధిత కుటుంబాలకు మాజీ...

టీడీపీ పార్టీలో కమీషన్ల కలకలం

అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ ఎంపీలకే, గుత్తేదారులకే కమిషన్ వేధింపులు...

వంశీ ‘మహా’ ఆవేదన

మహా టీవీ యాంకర్ మహా వంశీ తాజాగా తన చానెల్ లైవ్‌లో...

Topics

పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావ్?

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని భవానీపురంలో ఇటీవల ఇళ్ల కూల్చివేతల...

భళా ‘బాబు’

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయనే అంశం తాజాగా...

ఏందీ ‘బాబు’ ఇదీ

భవానీపురంలో 42 ఫ్లాట్లు కూల్చివేయబడటంతో రోడ్డున పడిన బాధిత కుటుంబాలకు మాజీ...

టీడీపీ పార్టీలో కమీషన్ల కలకలం

అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ ఎంపీలకే, గుత్తేదారులకే కమిషన్ వేధింపులు...

వంశీ ‘మహా’ ఆవేదన

మహా టీవీ యాంకర్ మహా వంశీ తాజాగా తన చానెల్ లైవ్‌లో...

ఏబీఎన్ వెంకటకృష్ణ బాగా హర్ట్ అయినట్టున్నాడు..

జాతీయ మీడియా చానెల్ రిపబ్లిక్ టీవీలో ఎడిటర్ అర్నాబ్ గోస్వామి ఇటీవల...

పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ...

వైసీపీ దాడి.. డిఫెన్స్ లో ‘కూటమి’

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. ప్రధాన ప్రతిపక్షం వై.ఎస్.ఆర్....

Related Articles

Popular Categories