టీవీ5 యాంకర్ సాంబశివరావు పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వారానికి ఆరు రోజులపాటు తెరపై కనిపించే సాంబ, ఆదివారం కూడా సెలవు తీసుకోకుండా తెరమీద కనిపించడంతో నెటిజన్లు విసిగిపోతున్నారు.
ఆదివారం ప్రోగ్రామ్ కోసం సరైన టాపిక్ దొరకకపోవడంతో సాంబశివరావు కొంత అయోమయానికి గురయ్యారట. ఆ సమయంలో టీవీ5 సీఈవో మూర్తి సలహా ఇచ్చారట “మీకు అంత ఇబ్బంది ఎందుకు? నేను సబ్జెక్ట్ ఇస్తాను!” అంటూ. ఆ సలహా తీసుకుని సాంబ కొత్త టాపిక్‌పై ప్రోగ్రామ్ నడిపారు.
కానీ ప్రేక్షకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. “సండే రోజైనా సాంబ నుంచి రిలీఫ్ దొరకదా?”, “ఒక రోజు ఆపితే ఏమవుతుంది?” అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వరదలా వచ్చిపడుతున్నాయి.
ఎవరి అభిప్రాయం ఏదైనా, టీవీ5 సాంబ మాత్రం తన స్టైల్‌లోనే కొనసాగుతున్నాడు. ప్రేక్షకులు విసిగినా, సాంబకు మాత్రం “టాపిక్”లు ఎక్కడో దొరుకుతూనే ఉన్నాయ్!


