ఒకప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ ప్రజల్లోకి వెళ్లి నిప్పులు చెరిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ — ఇప్పుడు అధికారంలోకి రాగానే ప్రజలనే దూరం చేసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదు. ఆ హామీల గురించి ప్రశ్నిస్తారనే భయంతో పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లే ప్రతి పర్యటనలో కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజాగా ఆయన పర్యటనల్లో పోలీసులు భారీ బారికేట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు ఆయనను చేరుకోవడం, మాట్లాడడం, సమస్యలు వినిపించడం సాధ్యం కావడం లేదు. “బారికేట్ల డిప్యూటీ సీఎం” అనే బిరుదు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలకు దగ్గరగా ఉండాల్సిన నాయకుడు బారికేడ్ల వెనుక దాక్కోవడం ఎలాంటి పాలనకు సంకేతమని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో పవన్ కళ్యాణ్ నిర్భయంగా రోడ్లపైకి వచ్చి ప్రజల సమస్యలను బహిరంగంగా ఎత్తిచూపారు. కానీ ఇప్పుడు అధికారం రాగానే అదే ప్రజలను ఎదుర్కోవడానికే భయపడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. “ప్రజల పక్షాన పోరాడతాను” అన్న వాగ్దానం క్రమంగా మాటల్లోనే మిగిలిపోయిందని జనసేన కార్యకర్తల్లో కూడా అసంతృప్తి పెరుగుతోంది.
ప్రజలు ఎదురుచూస్తున్న ప్రశ్న ఒక్కటే బారికేడ్ల వెనుక దాక్కునే పవన్ కళ్యాణ్‌కి నిజంగా ప్రజలపై నమ్మకముందా?


