ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న నకిలీ మద్యం కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మొలకలచెరువులో భారీ నకిలీ మద్యం డంప్ బయటపడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.
ఈ కేసులో టీడీపీ నేతలదే ప్రమేయం ఉన్నా.. వారు కుట్ర పన్ని వైసీపీని ఇరికిస్తున్నారు. ఇందులో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు లాగి వెలుగులోకి రావడంతో పరిస్థితులు వేడెక్కాయి. ఈ ఉదయం ఆయన నివాసం వద్దకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చేరి సోదాలు ప్రారంభించింది. జోగి రమేష్‌తో పాటు ఆయన సోదరుడు రాముని కూడా అరెస్టు చేశారు.
నకిలీ మద్యం ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు, జోగి రమేష్‌కు సన్నిహితుడని, ఆయన ప్రోత్సాహంతోనే ఈ కల్తీ మద్యం తయారైనట్లు తప్పుడు ఆరోపణలు చేశారు.. అంతేకాదు, అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఈ వ్యాపారం జరిగిందని టీడీపీకి డ్యామేజ్ కాకుండా నెపాన్ని జోగి రమేష్ పైకి తోసేసారు.
ఈ ఆరోపణలను వైసీపీని దెబ్బతీసేందుకు టీడీపీ ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. సాక్ష్యాలు సేకరించి జోగి రమేష్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రిపై ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.


