Top Stories

పిఠాపురంలో దారుణ‌మైన రాజ‌కీయాలు

పేద‌రికానికి, ఆక‌లికి కులం ఉండ‌దు, అంద‌రి స‌మ‌స్యే. కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం, యు.కొత్త‌ప‌ల్లి మండ‌లం మూల‌పేట గ్రామంలో రేష‌న్ బియ్యం పంపిణీలో దారుణ‌మైన రాజ‌కీయాలు, వివ‌క్ష చోటుచేసుకున్నాయ‌ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మూల‌పేట గ్రామంలోని షాప్ నంబ‌ర్ 27, 28, 47కు సంబంధించిన కొంద‌రు లబ్ధిదారుల‌కు 50 కిలోల బియ్యం పంపిణీ చేయగా, అదే గ్రామానికి చెందిన మ‌రికొన్ని కులాల వారికి మాత్రం 25 కిలోల బియ్యం మాత్ర‌మే పంపిణీ చేస్తున్నారంటూ ఆందోళ‌న వ్యక్త‌మ‌వుతోంది.

ఈ వివ‌క్ష‌పై ఆగ్ర‌హం వ్యక్తంచేసిన శెట్టిబ‌లిజ, ద‌ళిత, నాయా బ్రాహ్మ‌ణ, యాద‌వ స‌హా మ‌రికొన్ని కులాల‌కు చెందిన లబ్ధిదారులు త‌మ‌కు అన్యాయం జ‌రిగిందంటూ సంబంధిత రేష‌న్ దుకాణాల ఎదుట తీవ్ర ఆందోళ‌న‌కు దిగారు. కులం ఆధారంగా బియ్యం పంపిణీలో తార‌త‌మ్యం చూప‌డం దారుణ‌మ‌ని వారు ఆవేద‌న వ్యక్తంచేశారు. అందరికీ స‌మానంగా 50 కిలోల బియ్యం పంపిణీ చేయాల‌ని వారు డిమాండ్ చేశారు.

స్థానికంగా అధికార పార్టీకి లేదా రాజ‌కీయ నాయకుల‌కు అనుకూలంగా ఉన్న‌వారికి మాత్ర‌మే ఎక్కువ బియ్యం ఇచ్చి, మిగిలిన వారిని ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. పేద‌ల కడుపు కొట్టే ఇలాంటి వివ‌క్ష‌పై అధికారులు తక్షణ‌మే స్పందించి, అందరికీ స‌మానంగా బియ్యం పంపిణీ చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బాధితులు కోరుతున్నారు.

ప్రజలకు అందాల్సిన రేష‌న్ బియ్యం పంపిణీలో కుల రాజ‌కీయాలు, వివ‌క్ష చోటుచేసుకోవ‌డం పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర చర్చ‌నీయాంశంగా మారింది. అధికారులు ఈ విష‌యాన్ని ప‌రిశీలించి, పేద‌ల ఆకలి తీర్చేందుకు స‌రైన న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.

https://x.com/greatandhranews/status/1985260410467975526

Trending today

గోచీ ఊడిపోయినా సరే.. జగన్ ను కలవాల్సిందే.. అంత అభిమానం

కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని నెప్పల్లిలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియా...

జగన్ వస్తే ఇట్లుంటదీ మరీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన...

సజ్జల చేతిలో మళ్లీ సాక్షి మీడియా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ...

అక్కినేని నాగార్జునకు ‘దువ్వాడ’ గండం!

బిగ్ బాస్ హౌస్ లో మాధురి ఎలిమినేషన్ తర్వాత దువ్వాడ శ్రీనివాస్...

‘బాబు’ వాయించాడు.. అస్సలు నవ్వకండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ నెల 1వ తేదీని ఇప్పుడు...

Topics

గోచీ ఊడిపోయినా సరే.. జగన్ ను కలవాల్సిందే.. అంత అభిమానం

కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని నెప్పల్లిలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియా...

జగన్ వస్తే ఇట్లుంటదీ మరీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన...

సజ్జల చేతిలో మళ్లీ సాక్షి మీడియా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ...

అక్కినేని నాగార్జునకు ‘దువ్వాడ’ గండం!

బిగ్ బాస్ హౌస్ లో మాధురి ఎలిమినేషన్ తర్వాత దువ్వాడ శ్రీనివాస్...

‘బాబు’ వాయించాడు.. అస్సలు నవ్వకండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ నెల 1వ తేదీని ఇప్పుడు...

జగన్, పవన్ పై ‘ఉండవల్లి’ కథ

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ ప్రస్తుతం రాజకీయాల్లో లేరు. కానీ...

టీవీ5 సాంబశివకు రెండు ప్రశ్నలు

కాశిబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. టీవీ5...

జోగి రమేష్ అరెస్టు వెనుక రాజకీయ కథ!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నేతల్లో జోగి రమేష్ ఒకరు....

Related Articles

Popular Categories