ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపై కాగ్ సంచలన నివేదిక విడుదల చేసింది. రాష్ట్రం చూపిస్తున్న ఆదాయం వాస్తవానికి చాలా తక్కువగా ఉందని కాగ్ స్పష్టం చేసింది. 100 రూపాయల ఆదాయం రావాల్సి ఉంటే కేవలం 30 రూపాయలే వసూలు అవుతున్నాయని పేర్కొంది.
రెవెన్యూ లోటు 140 శాతం పెరిగిందని, ఖర్చులు అదుపు తప్పాయని, కేవలం ఆరు నెలల్లోనే ₹67 వేల కోట్ల అప్పులు తీసుకున్నారని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి.
ఇక ఆశ్చర్యకరంగా, ఈ నివేదిక ఆధారంగా ఆంధ్రజ్యోతి మరియు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కూడా చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. “పోటెత్తుతున్న లోటు” అంటూ ఆంధ్రజ్యోతి కథనం సంచలనం సృష్టించింది.
ఇప్పటివరకు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన రాధాకృష్ణ మీడియా, ఇప్పుడు బాబు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను బయటపెట్టడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.
జగన్ అనుచరులు సోషల్ మీడియాలో “జగన్ బెస్ట్.. బాబు వేస్ట్ అంటున్నది కాగ్, ఆంధ్రజ్యోతి రెండూ” అంటూ ట్రెండ్ చేస్తున్నారు.
https://x.com/WarriorYsJagan/status/1987820514187055442?s=20

