టీవీ5 న్యూస్ యాంకర్ సాంబశివరావు గారు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. తనను ట్రోల్ చేస్తున్న వారిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ట్రోలింగ్‌కు దారితీశాయి. “నన్నే ట్రోలింగ్ చేస్తారా” అంటూ టీవీ5లో లైవ్‌లో తన ఆవేదన వ్యక్తం చేసిన సాంబశివరావు గారు… ఏకంగా ప్రజలకు ఒక బంపర్ పిలుపు ఇచ్చారు. అదేంటంటే… “సోషల్ మీడియా చూడటం మానేయండి!!”
సాంబశివరావు గారికి సోషల్ మీడియా ట్రోలింగ్ కొత్త కాదు. నిత్యం ఏదో ఒక కారణంతో ఆయన చర్చల్లో ఉంటుంటారు. అయితే, ఈసారి ట్రోలింగ్ పరాకాష్టకు చేరడంతో, ఆయన టీవీ వేదికగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక తన ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, ఆయన ఆక్రోశాన్ని అర్థం చేసుకోని నెటిజన్లు ఈ వీడియోను కూడా వదలకుండా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
సాంబశివరావు గారి పిలుపును నెటిజన్లు అత్యంత ఫన్నీగా మార్చేశారు. ఈ పిలుపు మేరకు ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా సంస్థలైన ట్విట్టర్ (X), యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తమ ఇండియా ఆఫీసులను మూసివేయాలని నిర్ణయించుకున్నట్టుగా జోకులు పేల్చుతున్నారు.
“అంతర్జాతీయ ప్రముఖ యాంకర్ టీవీ5 సాంబశివరావు దెబ్బకు .. ఆయన పిలుపు మేరకు తమ ఇండియా ఆఫీసులను మూసివేయాలని నిర్ణయించిన సోషల్ మీడియా కంపెనీలు… టీవీ5 సాంబశివరావు టార్చర్ ఆ రేంజ్ లో ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు.


