Top Stories

షుగర్ వచ్చినోడు బియ్యం తినడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యవసాయ విధానంపై చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు రైతాంగంలో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పెరుగుతున్న డయాబెటిస్ కేసులు, మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్ల నేపథ్యంలో, కేవలం వరి పంటపైనే ఆధారపడటం కంటే ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటలు, ముఖ్యంగా కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను ఆయన గట్టిగా నొక్కి చెప్పారు.

చంద్రబాబు మాట్లాడుతూ.. “పండించే ధాన్యం తినేవాళ్లు లేరు రాష్ట్రంలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని, అయితే కేవలం ఆ కారణంగానే వరి పండించడం సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు. ధాన్యాన్ని వినియోగించే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

“ఎందుకంటే అందరికీ డయాబెటిక్ వచ్చింది. ప్రజలు బియ్యాన్ని తీసుకోవడం తగ్గించడానికి ప్రధాన కారణం విస్తృతమవుతున్న డయాబెటిస్ సమస్యేనని ఆయన సూచించారు. “షుగర్ వచ్చినోడు బియ్యం తినడు” అంటూ మధుమేహం ప్రభావం ఆహారపు అలవాట్లపై ఎంత ఉందో వివరించారు.

“ప్రజలు ఏమి తింటారో, మనం అవే పండించాలి రైతులు మార్కెట్ డిమాండ్‌ను, ప్రజారోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. వరి సాగును తగ్గించి, కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు వంటి వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దీర్ఘకాలికంగా రైతులకు లాభాలు దక్కాలన్నా, ప్రజారోగ్యం మెరుగుపడాలన్నా పంటల వైవిధ్యం అనివార్యమని ఆయన తేల్చి చెప్పారు.

రైతులు సాంప్రదాయ పంటల వైపు నుంచి అధిక విలువ, పోషక విలువలు గల ప్రత్యామ్నాయ పంటలకు మళ్లడం అనేది ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పు. ఈ నేపథ్యంలో రైతులకు నష్టాలు రాకుండా ప్రభుత్వం రాయితీలు, మద్దతు ధరతో కూడిన ప్రోత్సాహకాలు అందిస్తే, సీఎం గారి ‘వ్యవసాయ సలహాలు’ హాస్యాస్పదంగా కాకుండా, వ్యవసాయ విప్లవానికి నాంది పలికే అవకాశం ఉంది.

https://x.com/Anithareddyatp/status/1988793138572628141?s=20

Trending today

కల్తీ లడ్డూ : హెరిటేజ్ షేర్లు ఢమాల్

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడారనే...

రేవంత్ ఎసరుపెట్టిన ఏబీఎన్ ఆర్కే

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి...

చంద్రబాబుకు టచ్‌లోకి తెలంగాణ లీడర్స్?

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబునాయుడిని...

కల్తీ నెయ్యి.. హెరిటేజ్ లింకులు

తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారం రాజకీయ రంగంలో వేడి పెంచుతోంది. ఈ...

కూటమి అబద్దాల అప్పు

ఎన్నికల ముందు అప్పులపై తీవ్ర విమర్శలు చేసిన కూటమి నేతలు, అధికారంలోకి...

Topics

కల్తీ లడ్డూ : హెరిటేజ్ షేర్లు ఢమాల్

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడారనే...

రేవంత్ ఎసరుపెట్టిన ఏబీఎన్ ఆర్కే

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి...

చంద్రబాబుకు టచ్‌లోకి తెలంగాణ లీడర్స్?

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబునాయుడిని...

కల్తీ నెయ్యి.. హెరిటేజ్ లింకులు

తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారం రాజకీయ రంగంలో వేడి పెంచుతోంది. ఈ...

కూటమి అబద్దాల అప్పు

ఎన్నికల ముందు అప్పులపై తీవ్ర విమర్శలు చేసిన కూటమి నేతలు, అధికారంలోకి...

ఏపీ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి....

లోకేష్‌, పవన్‌పై బైరెడ్డి చెప్పిన కథ

వైఎస్సార్‌సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తాజాగా టీడీపీ, జనసేన పార్టీలపై...

కల్తీ నెయ్యి.. హెరిటేజ్ లింకులు

తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారం రాజకీయ రంగంలో వేడి పెంచుతోంది. ఈ...

Related Articles

Popular Categories