టీవీ5 యాంకర్ సాంబశివరావు మళ్లీ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు, చేసిన డిబేట్లు నెటిజన్ల విమర్శలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సాంబశివరావు టీవీ5 స్టూడియోలోనే తన అక్కసును బయటపెట్టారు.
తనపై వస్తున్న కామెంట్లు, ట్రోల్స్‌కు ఇకపై స్పందించబోనని స్పష్టం చేసిన ఆయన “ఈరోజు నుంచి పేటీఎం, సోషల్ మీడియా బ్యాచ్ రాసే వార్తల్ని, కామెంట్లను పట్టించుకోను,” అని బహిరంగంగా తెలిపారు.
సోషల్ మీడియాలో తమపై రాస్తున్న విమర్శలు తాము చెప్పిన మాటలు కొందరికి నచ్చకపోవడం వల్లే వస్తున్నాయని సాంబశివరావు వ్యాఖ్యానించారు. “మా గురించి రాస్తున్నారు అంటే మా మాటలు మీకు ఎక్కడ తగులుతున్నాయో అర్థం అవుతోంది. మేము మాట్లాడినవి ఎవరికో అసౌకర్యం కలిగిస్తున్నాయన్నదే స్పష్టం అవుతోంది,” అని ఆయన అన్నారు.
సాంబశివరావు వ్యాఖ్యలు తరచూ రాజకీయాల చుట్టూ తిరుగుతుండడం, కొన్నిసార్లు అతిగా రియాక్ట్ అవుతున్నట్లుగా కనిపించడం వల్ల నెటిజన్లు మీమ్స్, ట్రోల్స్‌తో ఆయనను టార్గెట్ చేస్తున్నారు. ఇదే విషయంపై ఆయనకు అప్పుడప్పుడు ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వస్తోంది.


