సినిమా ప్రమోషన్స్ అంటే రాజమౌళి ఓ రేంజ్ లో చేస్తాడు. అందులో ఆయన ముందుంటే మిగతా వాళ్లు వెనుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈసారి ఆయన మహేష్ బాబు మూవీ Globetrotter కోసం షూటింగ్ మొదటి దశ నుంచే ఒక కొత్త లెవెల్‌లో ప్రచారం మొదలుపెట్టారు. ఎల్లుండి రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ఈవెంట్ కోసం రిలీజ్ చేసిన తాజా వీడియో సోషల్ మీడియాలో పెద్ద సంచలనం రేపుతోంది.
ఈ వీడియోలో నార్త్ ఇండియా యూట్యూబ్ స్టార్ ఆశిష్ కనిపించాడు. “ప్రొమోషన్ పేరిట నమ్మించి, తర్వాత కిడ్నాప్ చేసి హైదరాబాద్ రామోజీకి తెచ్చారు… పాస్‌పోర్ట్, వీసా కూడా లాగేశారు!” అంటూ ఫన్నీగా చెప్పుకుంటూ లోపలికి వస్తాడు. అక్కడ రాజమౌళిని చూసి ఆశ్చర్యపోయిన ఆశిష్, “సార్… మీరు నన్నే కిడ్నాప్ చేశారా?” అని అడుగుతాడు. వెంటనే “అవును… ఎందుకంటే కారణం తెలుసుకోవాలంటే నవంబర్ 15 వరకు ఎదురు చూడాలి” అని రాజమౌళి సమాధానం చెబుతాడు.
ఈ వీడియో క్యూట్‌గా, ఫన్నీగా ఉండటంతో క్షణాల్లో వైరల్ అవుతోంది. ఒక చిన్న అప్డేట్ కోసం కూడా ఇంత భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్న రాజమౌళిని చూసి ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ సినిమా అంటే ఇలానే గ్రాండ్‌గా ఉండాలి కదా అంటూ సోషల్ మీడియా కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఈవెంట్‌కు 50 వేల మంది హాజరవుతారని రూమర్స్ వచ్చినా, రాజమౌళి స్పందిస్తూ — “ఓపెన్ ఈవెంట్ కాదు, పాస్ ఉన్నవారికే అనుమతి” — అంటూ క్లారిటీ ఇచ్చారు.
రాజమౌళి ప్రమోషన్స్ కొత్త రేంజ్‌కి ఈ వీడియో మంచి ఉదాహరణగా నిలిచింది!


