Top Stories

టీవీ5 లో సాంబశివరావు సవాల్

టీవీ5 సీనియర్ యాంకర్ సాంబశివరావుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆయన లైవ్‌లో కౌంటర్ ఇచ్చారు. టీవీ5లో తన ప్రాధాన్యత తగ్గిందని, తనపై గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని, చానెల్‌లో తనకు పెద్ద స్థానం లేదని కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర అసంతృప్తికి గురి చేశాయి.

ఈ నేపథ్యంలో “నేను టీవీ5లో ఒక సాధారణ ఉద్యోగి కాదు” అంటూ సాంబశివరావు స్పష్టం చేశారు. టీవీ5 మేనేజ్‌మెంట్‌లో తాను కీలక బాధ్యతల్లో ఉన్నానని, చానెల్ విధాన నిర్ణయాల్లో కూడా తన అభిప్రాయానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు.

సాంబశివరావు తన లైవ్‌లో మాట్లాడుతూ “టీవీ5 అంటే ఏమనుకుంటున్నారు? ఇక్కడ నేను ఉద్యోగి కాదండి. మేనేజ్‌మెంట్‌లో ఉన్నాను. చానెల్ నిర్ణయాల్లో నా పాత్ర ఉంటుంది. బయట ఎవరు ఏమని మాట్లాడినా… మేము టీవీ5లోనే ఉంటాం. టీవీ5 గురించి అవాకులు చెవాకులు పేలడం ఆపండి” అని హెచ్చరించారు.

అంతేకాదు, తనపై తప్పుడు వార్తలు, అపప్రథ ప్రచారం చేసే సోషల్ మీడియా పేజీలను కూడా ఆయన పరోక్షంగా టార్గెట్ చేశారు. “పైకి వెళ్లేటప్పుడూ జెండా కప్పుకునే వెళతాం… టీవీ5పై ప్రేమ, నిబద్ధత తగ్గేది లేదు” అంటూ తన స్టాండ్‌ను మరింత బలంగా వ్యక్తపరిచారు.

ఇటీవలి కాలంలో యూట్యూబ్, సోషల్ మీడియాలో టీవీ5 యాంకర్లపై, ముఖ్యంగా సాంబశివరావుపై అనేక రకాల రూమర్లు రాగా, వాటన్నింటికీ ఆయన ఈ లైవ్ ద్వారా సమాధానం ఇచ్చినట్లైంది.

సాంబశివరావు వ్యాఖ్యలు స్పష్టంగా చెబుతున్నాయి.
టీవీ5లో తన స్థానం తగ్గలేదని, చానెల్‌తో తన బంధం కుదుటగానే ఉందని, సోషల్ మీడియా అపప్రచారాన్ని ఇక భరించబోనని!

Trending today

ఈటీవీకి రూ.92.04 లక్షలు కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం  

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు నీతులు చెబుతూ, మరోవైపు తన అనుకూల...

సీరియస్ ఆలోచన దిశగా బొత్స!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రాజకీయ ప్రస్థానం...

చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సలహా

వైసీపీకి గుడ్‌బై చెప్పిన తర్వాత రాజకీయాల నుంచి దూరంగా ఉంటానని చెప్పిన...

ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన

ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై మరోసారి రాజకీయ చర్చలు చెలరేగుతున్నాయి. బీహార్...

మళ్లీ ‘అమరావతి’ ఉద్యమం

అమరావతి రైతుల్లో మరోసారి ఆందోళన చెలరేగుతోంది. రాజధానికి పూర్తి చట్టబద్ధత కల్పించి,...

Topics

అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషర్రఫ్ ‘బాబు’

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరుపై ప్రస్తుతం సోషల్...

టీవీ5 ‘సాంబ’న్న మళ్లీ ఏసాడు

టీవీ5 యాంకర్ సాంబశివరావు మరోసారి వార్తల్లోకెక్కారు. ఆయన ఇటీవల నారా లోకేష్‌పై...

వైసీపీలో కసి పెరిగింది..

ఏపీలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ నిర్వహించిన ర్యాలీలపై తెలుగుదేశం పార్టీ...

Related Articles

Popular Categories