ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, తెలంగాణ గడ్డపై కూడా తనకు తిరుగులేని ఫాలోయింగ్ ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారు. ఇటీవల నాంపల్లి కోర్టు విచారణకు హాజరైన జగన్‌ను చూడడానికి తరలివచ్చిన జనసందోహాన్ని చూసి రాజకీయ వర్గాలే కాదు, విమర్శకులు సైతం ముక్కున వేలేసుకున్నారు.
సాధారణంగా కోర్టు వాయిదాలకు నాయకులు హాజరవడం సహజం. కానీ, జగన్ రాక మాత్రం ఒక సంచలనంగా మారింది. ఆయన వస్తున్నారని తెలియగానే తెలంగాణ నలుమూలల నుండి వైఎస్ఆర్ అభిమానులు, జగన్ సైనికులు భారీ సంఖ్యలో నాంపల్లి కోర్టు వద్దకు చేరుకున్నారు. “జై జగన్” నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఏపీలోనే కాదు, తెలంగాణలోనూ జగన్ కు వీరాభిమానులు ఉన్నారని ఈ ఘటన స్పష్టం చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పేదల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. ఆ అభిమానమే నేడు జగన్ మోహన్ రెడ్డి రూపంలో వెల్లువెత్తింది. అధికారం ఉన్నా లేకపోయినా, ప్రాంతం ఏదైనా జగన్ కు ఉన్న క్రేజ్ తగ్గలేదని ఈ పరిణామం చాటిచెప్పింది.
జగన్ కు లభించిన ఈ అపూర్వ స్వాగతాన్ని చూసి విపక్ష మీడియా (ఎల్లో మీడియా) జీర్ణించుకోలేకపోతోంది. జగన్ తెలంగాణలో అడుగుపెడితే ఇంతటి స్పందన వస్తుందని వారు ఊహించలేకపోయారు. జగన్ కు జనం నీరాజనం పట్టడాన్ని తట్టుకోలేక, “ఇది బలప్రదర్శనా?” అంటూ పలు ఛానళ్లు డిబేట్లు పెట్టి తమ అక్కసును వెళ్లగక్కాయి.
జగన్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెనుక జనం ఉండటం సహజం. అది బలప్రదర్శన కాదు, బలమైన ప్రజాదరణ. ఎల్లో మీడియా ఎన్ని అర్థనాదాలు చేసినా, ఎన్ని కథనాలు వండి వార్చినా.. ప్రజల గుండెల్లో జగన్ స్థానం “పదిలం” అని తెలంగాణ గడ్డ మరోసారి నిరూపించింది. జగన్ స్టైల్ లో చెప్పాలంటే.. ఇది నిజంగానే “రఫ్ఫా.. రఫ్ఫా” ఆడిించే మొగ్గు!


