టీవీ5 ఛానెల్‌లో లైవ్ డిబేట్ నిర్వహిస్తూ తనదైన శైలిలో విశ్లేషణ చేసే యాంకర్ సాంబశివరావు తాజాగా మరోసారి వార్తల్లోకెక్కారు. యూకే నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (వైసీపీ) ప్రతినిధిగా ఉంటూ, సోషల్ మీడియాలో టీవీ5పై, ప్రత్యేకించి సాంబశివరావుపై సెటైరికల్, టీజింగ్ వీడియోలు చేస్తున్న వ్యక్తికి కౌంటర్‌గా ఆయన లైవ్ కార్యక్రమం నుంచే ‘మాస్ వార్నింగ్’ ఇచ్చారు.
యూకే నుంచి వస్తున్న విమర్శలు, ట్రోలింగ్ వీడియోలపై సహనం కోల్పోయిన సాంబశివరావు, లైవ్ కార్యక్రమం నుంచే ఘాటుగా స్పందించారు. “ఇండియాకు రా, చూసుకుందాం” అంటూ ఎయిర్‌పోర్టులోనే తేల్చుకుందాం అని సవాల్ విసిరారు. ముఖ్యంగా, ‘ఎల్ ముండల’ అని సంబోధించిన ట్రోలర్‌కు గట్టి సమాధానం ఇస్తూ, ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు.
జనరల్‌గా తన చర్చల్లో సూటిగా, స్పష్టంగా మాట్లాడే సాంబశివరావు, ఈ తరహా ‘మాస్’ పద్ధతిలో స్పందించడం చర్చనీయాంశంగా మారింది.
సాంబశివరావు ఇచ్చిన ఈ ‘వార్నింగ్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలామంది ఆయన వాగ్ధాటిని మెచ్చుకుంటే, మరికొంతమంది మాత్రం లైవ్‌లో ఇలాంటి వ్యక్తిగత సవాళ్లు, బెదిరింపులు సరికాదని కౌంటర్లు ఇస్తున్నారు.
“మీరు రేపు రమ్మంటే రేపు రావడం కష్టం!! అందుకే ఇక ఆపేయడం బెటర్ సార్!!” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.
ఒక టీవీ యాంకర్ హోదాలో ఇలా వ్యక్తిగతంగా సవాల్ విసరడం వృత్తిపరమైన విలువలకు తగదని మరికొందరు విమర్శిస్తున్నారు.
ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తి చేసే ట్రోలింగ్‌కు ఇంతలా స్పందించాల్సిన అవసరం లేదని, ఇది ఆయనకు ప్రతికూలంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఏదేమైనా, ఒక యూకే వైసీపీ ప్రతినిధి సెటైరికల్ వీడియోలు, టీవీ5 సాంబశివరావు మాస్ వార్నింగ్‌ల వ్యవహారం ఇప్పుడు తెలుగు మీడియా, సోషల్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


