Top Stories

తెలంగాణను వదిలేసి ఆంధ్రాకు వెళ్లిపో పవన్ కళ్యాణ్

కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ల ‘దిష్టి’ తగిలిందన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పవన్‌పై మాటల దాడికి దిగారు.

కోనసీమలో ఎండిపోయిన కొబ్బరి తోటలను పరిశీలించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ‘దిష్టి’ వ్యాఖ్యలపై తెలంగాణ నేతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పవన్‌పై ఇప్పటికే ఘాటుగా విమర్శలు చేశారు.

తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మరింత తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ ‘సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రాకు వెళ్లిపో’ అని దుమ్మెత్తిపోశారు.

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రాకు వెళ్లిపో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్‌ను తెలంగాణ నుండి పరిగెత్తించి తరిమి కొడతాం. పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వం. గతంలో సినిమాలు ఆడడానికి తెలంగాణ అంటే ఇష్టం అని, ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వగానే బలుపుతో మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే పరిగెత్తించి తరిమి కొడతాం.” అని హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి, గోదావరి జిల్లాల్లో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి శాస్త్రీయ కారణాల బదులు ‘దిష్టి’ వంటి అంశాలను ప్రస్తావించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పవన్ వ్యాపారాలు, నివాసం హైదరాబాద్‌లోనే ఉన్నాయని, మా దిష్టి ఉంటే ఆయన ఇక్కడ ఉండగలుగుతారా అని తెలంగాణ నేతలు ప్రశ్నిస్తున్నారు.పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెబుతారా, లేదా వివాదం మరింత ముదురుతుందా అనేది చూడాలి.

https://x.com/TeluguScribe/status/1995535805507674422?s=20

https://x.com/2029YSJ/status/1995669898937467109?s=20

Trending today

టీడీపీ కోట్లకు కోట్లు పంచేసిందిలా..

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వివిధ కార్యక్రమాలు, సభలు,...

‘ఐరన్ డోమ్’కి మించిన రక్షణ కవచం

ఇజ్రాయెల్ అంటే గుర్తుకొచ్చే మొట్టమొదటి పేరు ఐరన్ డోమ్ . శత్రువుల...

ఒకే… ఒకే… అర్థమయ్యింది వెంకటకృష్ణ!

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ యాంకర్ అయిన వెంకటకృష్ణ మరోసారి తన ఛానెల్‌లో...

చెప్పుతో కొడతా నా కొడుకా..

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో...

టీవీ5 సాంబశివ రావు సవాల్ పై యూకే డాక్టర్ కౌంటర్ ఇదీ

టీవీ5 ఛానెల్‌లో యాంకర్ సాంబశివరావు పాల్గొన్న ఒక వీడియో క్లిప్ ఇటీవల...

Topics

టీడీపీ కోట్లకు కోట్లు పంచేసిందిలా..

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వివిధ కార్యక్రమాలు, సభలు,...

‘ఐరన్ డోమ్’కి మించిన రక్షణ కవచం

ఇజ్రాయెల్ అంటే గుర్తుకొచ్చే మొట్టమొదటి పేరు ఐరన్ డోమ్ . శత్రువుల...

ఒకే… ఒకే… అర్థమయ్యింది వెంకటకృష్ణ!

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ యాంకర్ అయిన వెంకటకృష్ణ మరోసారి తన ఛానెల్‌లో...

చెప్పుతో కొడతా నా కొడుకా..

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో...

టీవీ5 సాంబశివ రావు సవాల్ పై యూకే డాక్టర్ కౌంటర్ ఇదీ

టీవీ5 ఛానెల్‌లో యాంకర్ సాంబశివరావు పాల్గొన్న ఒక వీడియో క్లిప్ ఇటీవల...

పవన్.. దమ్ముంటే దీనికి సమాధానం చెప్పు?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల...

మాజీ మంత్రి విడదల రజిని గుడ్‌బై ? 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి విడదల రజిని తీసుకునే తదుపరి నిర్ణయంపై...

జగన్ ఒక్క వీడియో.. ‘కూటమి’ షేక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన...

Related Articles

Popular Categories