టాలీవుడ్ స్టార్ హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెరపై ఆయన పలికే ప్రతీ మాటా పౌరుషం ఉట్టిపడేలా, గంభీరంగా ఉంటుంది. కానీ, నిజ జీవితంలో ఆయన మాట్లాడే స్లాంగ్, మాట తీరు కాస్త సాగదీస్తూ… ఒక ప్రత్యేకమైన వెరైటీగా ఉంటుంది. అందుకే, తెలుగులో అనర్గళంగా మాట్లాడే బాలయ్య బాబు, హిందీలో మాట్లాడితే ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి అభిమానుల్లో, సినీ ప్రేక్షకుల్లో సహజంగానే ఉంటుంది.
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, తెలుగులో అద్భుతంగా మాట్లాడగలిగే బాలయ్యకు హిందీ భాషపై కూడా మంచి పట్టు ఉంది. ఈ విషయంపై అభిమానుల్లో ఉన్న ఆసక్తిని నిజం చేస్తూ, తాజాగా బాలయ్య హిందీలో మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అఖండ’కు సీక్వెల్‌గా ‘అఖండ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్న నేపథ్యంలో బాలయ్య బాబు ఓ హిందీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో బాలయ్య హిందీలో మాట్లాడుతూ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు.
బాలయ్య బాబు హిందీలో మాట్లాడటంతో పాటు, హిందీ పాటల్లోని ‘సారా జహాసే అచ్చా’ అనే పంక్తులను అలవోకగా పలకడం అందరినీ ఆకట్టుకుంది. అంతేకాక, ఆయన సనాతన ధర్మం గురించి, తన తండ్రి నందమూరి తారక రామారావు గారి గురించి, నాటి హిందీ సినిమాల గొప్పదనం గురించి అద్భుతంగా హిందీలో మాట్లాడారు. ఆయన మాటల్లోని స్పష్టత, విషయంపై ఆయనకున్న అవగాహన చూసి అభిమానులు మరింత మురిసిపోతున్నారు.
బాలయ్య హిందీ ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అవుతోంది. తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బాలయ్య హిందీ స్పీచ్‌ను చూసి, అభిమానులు ‘మా బాలయ్య బాబుకి హిందీ కూడా వచ్చు’ అంటూ కామెంట్లు పెడుతూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.


