Top Stories

ఏపీలో పెరగనున్న నియోజకవర్గాలు.. ఎన్ని? ఎక్కడ ? అంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన (2014) సమయంలోనే ఈ పెంపు గురించి ప్రస్తావించినప్పటికీ, జనగణన , కులగణన ప్రక్రియలు పూర్తి కాకపోవడం వల్ల ఆలస్యమైంది.

వచ్చే ఏడాది ఏప్రిల్ (2026) నుంచి ప్రారంభమై 2027 ఫిబ్రవరి వరకు కొనసాగనుంది. జనగణన తరువాత కులగణన మొదలవుతుంది. రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తవుతుంది. 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

ఏపీలో దాదాపు 50 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అదనంగా రెండు అసెంబ్లీ సీట్లు పెరగవచ్చని అంచనా.

ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ సీట్లకు మరో 50 సీట్లు తోడై, మొత్తం 225 అసెంబ్లీ స్థానాలతో ఏపీ శాసనసభ కొలువుదీరనుంది.

తెలంగాణలో సైతం సీట్ల సంఖ్య పెరగనుంది.

ఉమ్మడి ఏపీలో 294 అసెంబ్లీ స్థానాలు, 42 పార్లమెంట్ స్థానాలు ఉండేవి. విభజన తరువాత ఏపీకి 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలు మిగిలాయి.

చివరిసారిగా 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది, ఆ సమయంలో అధికార పార్టీకి లాభం చేకూరింది. పునర్విభజన ఎప్పుడు జరిగినా, అధికారంలో ఉన్న పార్టీకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఏపీలో కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న బీజేపీ అధికారంలో ఉన్నాయి.

సీట్ల సంఖ్య పెరిగితే, 2029 ఎన్నికల్లో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్న కూటమిలోని అభ్యర్థులకు సీట్ల సర్దుబాటు సులభమవుతుంది.

అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికార పక్షంలో అసంతృప్తితో ఉన్న నాయకులు తమవైపు వస్తారని అంచనా వేస్తోంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories