ఇటీవల బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన దువ్వాడ మాధురి, తన వ్యాఖ్యలతో మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా రీతూ చౌదరి – డిమోన్ పవన్ బంధంపై ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి.
రీతూ తల్లి ఫోన్ చేసి “వాళ్ల రిలేషన్ బాగోలేదు” అని చెప్పిందని మాధురి వెల్లడించగా, తాజాగా ఎలిమినేషన్ తర్వాత మీడియాతో మాట్లాడిన రీతూ చౌదరి తల్లి మాత్రం అలాంటి ఫోన్ ఎప్పుడూ చేయలేదని స్పష్టం చేశారు.
ఇది వెలుగులోకి రావడంతో, మాధురి చెప్పిన మాటలన్నీ అబద్దాలేనన్న చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సాగుతోంది. ఇదే తరహాలో భరణి–దివ్య విషయంలో కూడా ఆమె చెప్పిన మాటలకు, ఫ్యామిలీ వీక్‌లో వచ్చిన దివ్య తల్లి మాటలకు పొంతన లేకపోవడం ప్రేక్షకుల్లో అనుమానాలు పెంచింది. ఈ పరిణామాలతో “దువ్వాడ మాధురి అబద్దాల పుట్ట” అంటూ నెటిజన్లు తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు.


