జనసేన పార్టీలో కలకలం రేపుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యలమంచిలి జనసేన పార్టీ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సోదరుడు సతీష్ కుమార్ యువతులతో కలిసి రికార్డింగ్ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో తీవ్ర వివాదాస్పదంగా మారింది.
ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా రికార్డింగ్ డాన్స్‌లపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. చట్ట విరుద్ధమైన ఈ కార్యక్రమాలపై నిషేధం అమల్లోకి వచ్చిందని అధికార యంత్రాంగం ప్రకటించింది. అయితే నిషేధం కొనసాగుతున్న సమయంలోనే జనసేన నేత కుటుంబానికి చెందిన వ్యక్తి బహిరంగంగా రికార్డింగ్ డాన్స్‌లో పాల్గొనడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
సామాన్యులైతే వెంటనే కేసులు, అరెస్టులు, జరిమానాలు… కానీ కూటమి నేతల విషయంలో మాత్రం చట్టాలన్నీ సడలుతాయా? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. “నిబంధనలు సామాన్యులకేనా? అధికార పార్టీల నేతలకు వర్తించవా?” అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
ఈ వ్యవహారంపై జనసేన అధిష్ఠానం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఒకవైపు సామాజిక భద్రత, మహిళల గౌరవం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న నేతల వర్గంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పార్టీ ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగించే పరిస్థితి ఏర్పడుతోంది.
ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుందా? లేక ఇది కూడా రాజకీయ బలం పేరుతో మరిచిపోతుందా? అన్నది వేచి చూడాల్సిందే.


