Top Stories

10వ తేదీ వచ్చినా జీతాల్లేవు

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, పది రోజులు దాటినా ఇంకా వారికి జీతాలు చెల్లించలేని దుస్థితి కూటమి పాలనలో నెలకొందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి గారు తీవ్ర స్థాయిలో విమర్శించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా 10వ తారీఖు వచ్చినా కూడా జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. “ఉద్యోగులు తమ నెలవారీ ఖర్చులకు, ఈఎంఐలకు, ఇంటి అవసరాలకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలు చెప్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. “జీఎస్డీపీలో (GSDP) దూసుకుపోతున్నాం అంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలతో, సొల్లు మాటలతో రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. వాస్తవానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేని పరిస్థితిలో, ఈ ‘దూకుడు’ కబుర్లు దేనికి సంకేతం?” అని ఆయన ప్రశ్నించారు.

కూటమి పాలనలో రాష్ట్రం ఆర్థికంగా, పాలనాపరంగా పూర్తిగా వెనక్కి వెళ్లిపోయిందని వెంకటరెడ్డి పేర్కొన్నారు. “కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రం కేవలం అప్పులు, అవినీతి, అరాచకాలలో మాత్రమే దూసుకుపోతుంది. అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు, కానీ అప్పులు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం గాలిలో దీపంలా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు జీతాలు చెల్లించి, వారి సమస్యలను పరిష్కరించాలని” వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories