హైదరాబాద్ అభివృద్ధి అంతా చంద్రబాబు నాయుడి వల్లేనంటూ టీవీ5 లైవ్ షోలో యాంకర్ సాంబశివరావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌ను కట్టించింది చంద్రబాబే, ఔటర్ రింగ్ రోడ్డు బాబు, ఐటీని హైదరాబాద్‌కు తీసుకొచ్చింది కూడా ఆయనే అంటూ వరుసగా లిస్టు చదువుతూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
హైటెక్ సిటీ, ఐఎస్‌బీ, పీవీ ఫ్లైఓవర్, అంతర్జాతీయ విమానాశ్రయం, నగర అభివృద్ధి… ఇలా ఎన్నో ప్రాజెక్టుల వెనుక చంద్రబాబు పాత్ర ఉందని, అయినా ఆయనకు తగిన క్రెడిట్ ఇవ్వడం లేదని సాంబశివరావు మండిపడ్డారు. “ఇవన్నీ చేసిన చంద్రబాబుకు క్రెడిట్ కనిపించదా?” అంటూ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్ అయ్యాయి. “మీరు కళ్ళున్నాయి… కానీ కభోదిలు!
మనుషులే… కానీ మనసు లేదు!” అంటూ లైవ్‌లోనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు క్షణాల్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.
అయితే, నెటిజన్లు మాత్రం దీనికి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. “అంతా బాబే… ఓకే సార్!” అంటూ సెటైరిక్ కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్ అభివృద్ధి అనేది ఒక్క వ్యక్తి వల్ల మాత్రమే కాదని, అనేక ప్రభుత్వాలు, నాయకులు, ప్రజల కృషి కూడా కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి టీవీ5 లైవ్‌లో సాంబశివరావు చేసిన ఈ ఫైర్ మాటలు రాజకీయ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ‘అంతా బాబే’ అనే నినాదం ఇప్పుడు ట్రోల్స్ రూపంలో మరింత వైరల్ అవుతోంది.


