టీవీ5 సీనియర్ యాంకర్ సాంబశివరావు లైవ్ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దని ఆయన చేసిన విన్నపం చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. గత కొంతకాలంగా తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయని, సుమారు 20 నుండి 30 మంది ఫోన్ చేసి ఇబ్బంది పెట్టారని సాంబశివరావు లైవ్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రాజకీయంగా మీకు ఏవైనా విమర్శలు ఉంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లేదా ప్రధాని మోడీని తిట్టుకోండి.. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించుకోండి, మాకేం సంబంధం? కానీ నా జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు” అంటూ ఘాటుగా హెచ్చరించారు.
దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “నాయకులను తిట్టమని ఆప్షన్ ఇవ్వడం ఏంటి సాంబన్నా?” అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఒక జర్నలిస్టుగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కొందరు విమర్శిస్తుండగా, వ్యక్తిగత దూషణలు ఎవరికైనా ఇబ్బందికరమేనని ఆయన మద్దతుదారులు అంటున్నారు.


