అరకు పార్లమెంట్ నియోజకవర్గం.. గిరిజన హృదయస్పందన తెలిసిన నేల. అక్కడ రాజకీయం అంటే కేవలం ఓట్లు, సీట్లు మాత్రమే కాదు, గిరిజన జీవితాల్లో మార్పు కోరుకునే ఒక బంధం. వరుసగా మూడు సార్లు వైసీపీ ఇక్కడ ఎందుకు జెండా పాతగలిగింది అనేదానికి ప్రస్తుత ఎంపీ డాక్టర్ తనూజారాణి చేపట్టిన తాజా కార్యక్రమమే ఒక నిలువుటద్దం.
పుట్టినరోజున ‘పది’ ప్రాణదాతలు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని, ఎంపీ తనూజారాణి గారు గిరిజన ప్రాంతాల కోసం 10 అంబులెన్స్‌లను కానుకగా అందించారు. రవాణా సౌకర్యాలు సరిగ్గా లేని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో, అత్యవసర సమయాల్లో ఆస్పత్రికి వెళ్లడం ఒక పెను సవాలు. అటువంటి చోట ప్రాణాపాయ స్థితిలో ఉన్న గిరిజనులను ఆదుకునేందుకు ఈ అంబులెన్స్‌లు ‘ప్రాణదాతలు’గా నిలవనున్నాయి.
అరకు గిరిజనులు గడిచిన మూడు ఎన్నికల్లో వైసీపీకి ఎందుకు పట్టం కట్టారో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు.నాయకులు కేవలం గెలిచాక కనిపించకుండా పోవడం కాకుండా, ప్రజల ప్రాథమిక అవసరాలైన వైద్యం, విద్య వంటి అంశాలపై దృష్టి సారించడం. ఇతర పార్టీల నాయకులు చిన్న పని చేసినా సోషల్ మీడియాలో భారీ ఎత్తున ‘దేవుడు’ అంటూ డప్పు కొట్టుకుంటారని, కానీ వైసీపీ నేతలు మాత్రం భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నా ప్రచారానికి దూరంగా ఉంటున్నారని గిరిజన ప్రజలు అభిప్రాయపడుతున్నారు. “పావలా వంతు పని చేసి పరమాత్ముడిగా కీర్తించుకునే ఈ రోజుల్లో.. పది అంబులెన్స్‌లను అందించినప్పటికీ, ప్రచార ఆర్భాటాలకు వెళ్లకుండా నిశ్శబ్దంగా సేవ చేయడమే వైసీపీ అరకు ఎంపీ తనూజారాణి శైలి. ఇదే ఆ పార్టీని గిరిజన గుండెల్లో సుస్థిర స్థానాన్ని కల్పించేలా చేసింది.”
వైసీపీ శ్రేణులు ఈ విషయంలో తమ నాయకుల సేవా దృక్పథాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కార్యకర్తల నుంచి వస్తున్న వాదనలో వాస్తవం లేకపోలేదు. ఏది ఏమైనా, అరకు గడ్డపై వైసీపీకి ఉన్న ఆ ప్రజాదరణ వెనుక ఇలాంటి బలమైన సేవా హస్తాలే పునాదులని స్పష్టమవుతోంది.
https://x.com/MPRAVEENREDDY13/status/2002981412576862316?s=20


