ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కీలక మలుపులో ఉంది. నెల్లూరు జిల్లాలో వైసీపీని బలహీనపరచడమే లక్ష్యంగా బలమైన రాజకీయ కుటుంబాలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు టీడీపీ చేస్తోంది.
వైసీపీ ఆవిర్భావ దశలో జగన్ వెంట నిలిచిన కీలక నేతల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒకరు. ఎంపీ పదవిని వదులుకుని జగన్‌తో కలిసి నడిచిన ఆయన ఇప్పుడు కీలక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
నెల్లూరు జిల్లాలో పార్టీకి స్తంభంలా నిలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి నేతల దూరం వైసీపీని బాగా దెబ్బతీసింది. కనీసం వారితో చర్చించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఇక మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి పార్టీని జిల్లాలో నిలబెట్టలేకపోయారన్న విమర్శలూ ఉన్నాయి.
ఇప్పుడు నెల్లూరులో వైసీపీకి పెద్దదిక్కుగా మిగిలింది మేకపాటి రాజమోహన్ రెడ్డే. ఆయన కూడా దూరమైతే నష్టమే.. ఈ సంక్షోభానికి పరిష్కారం చూపించాల్సింది జగన్మోహన్ రెడ్డే.


