Top Stories

నేనే… నేనే… అన్నీ నేనే! సాయిరెడ్డి ట్వీట్ వైరల్

వైసీపీ రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్‌ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయోగాత్మక విమానం ల్యాండ్ అయిన సందర్భంగా స్పందించిన ఆయన… ఈ ప్రాజెక్ట్‌కు తానే ప్రధానంగా కృషి చేసినట్టు చెప్పుకొచ్చారు. పార్లమెంటులో మాట్లాడటం, మంత్రులతో సమావేశాలు పెట్టడం ద్వారా సమస్యలను లేవనెత్తానని, విశాఖ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయని వ్యాఖ్యానించారు.

అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. “అందులో మీ గొప్పతనం ఏముంది విజయసాయిరెడ్డి గారు?” అంటూ సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తున్నారు. పార్టీ తరపున గెలిచి, పార్టీ ఇచ్చిన పదవితోనే రాజ్యసభలో మాట్లాడిన విషయాన్ని మరిచి… మొత్తం క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ నేతల వాదన స్పష్టంగా ఒకటే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్ట్‌కు దిశా నిర్దేశం జరిగిందని, కర్త–కర్మ–క్రియ అన్నీ ఆయనేనని చెబుతున్నారు. కేంద్రంతో చర్చలు, అడ్డంకుల తొలగింపు, భూసేకరణ నుంచి పాలసీ స్థాయి నిర్ణయాల వరకు జగన్‌దే కీలక పాత్ర అని స్పష్టం చేస్తున్నారు.

“టికెట్ ఇచ్చింది జగన్, ఎంపీ పదవి ఇచ్చింది జగన్. వైసీపీ తరపునే మీరు రాజ్యసభలో మాట్లాడారు. అలాంటప్పుడు పార్టీని, నాయకత్వాన్ని పక్కనపెట్టి వ్యక్తిగత క్రెడిట్ తీసుకోవడం సరికాదని” వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.

భోగాపురం విషయంలో మిగతావాళ్ల పాత్రను వారు వ్యంగ్యంగా అభివర్ణిస్తున్నారు. “ఊర్లో పెళ్లికి కుక్కలు హడావిడి చేసినట్టే… అసలు పని చేసింది ఒకరే, హడావిడి చేసిన వాళ్లు వేరే” అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

మొత్తానికి భోగాపురం విమానాశ్రయం క్రెడిట్‌పై మొదలైన ఈ వివాదం… వైసీపీ అంతర్గత రాజకీయాల్లో మరోసారి కాకరేపుతోంది. క్రెడిట్ ఎవరిది అన్న ప్రశ్నకు పార్టీ శ్రేణులు మాత్రం ఒకే మాట చెబుతున్నాయి — అన్నీ జగన్‌దే, మిగతావాళ్లది హడావిడే!

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories