పద్ధతి, క్రమశిక్షణ, మహిళా గౌరవం గురించి మాట్లాడే జనసేన పార్టీ నాయకుల నీతులు క్షేత్రస్థాయిలో తుంగలో తొక్కబడుతున్నాయి. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముఖ్య అనుచరుడు ఒకరు చేసిన పని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
రాజోలు నియోజకవర్గ పరిధిలోని గోగన్నమట్టం గ్రామంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్స్‌లను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన జరుగుతుండగా, ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడిగా చెప్పుకునే ఒక వ్యక్తి మద్యం మత్తులో వేదికపైకి వెళ్లి మహిళా కళాకారుల పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించారు. సభ్య సమాజం తలదించుకునేలా, సదరు మహిళలను “జాకెట్లు విప్పమని” వేధిస్తూ నానా హంగామా సృష్టించారు.
సాంప్రదాయం, సంస్కృతి గురించి వేదికల మీద ఊదరగొట్టే పవన్ కళ్యాణ్ గారు, మీ పార్టీ కార్యకర్తల తీరు ఇదేనా? అని స్థానికులు మండిపడుతున్నారు. మహిళల రక్షణ కోసం “శక్తి” టీమ్స్, కఠిన చట్టాల గురించి మాట్లాడే కూటమి ప్రభుత్వంలో, అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులే ఇలా బరితెగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాజకీయ అండదండలు ఉన్నాయనే గర్వంతో మహిళలను అవమానించే ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు.. సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇలాంటి ఘటనలపై స్పందించి, తన పార్టీలో ఉన్న ఇటువంటి “అరాచక శక్తుల”పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.
https://x.com/Venkat_karmuru/status/2012012366540804253?s=20


