ఇటీవల ఒక చర్చా కార్యక్రమంలో టీవీ5 యాంకర్ సాంబశివరావు మాట్లాడుతూ నందమూరి కుటుంబం నుంచి ఒక వీరనారిగా నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. “ఎన్టీఆర్ మనవరాలిగా, బాలకృష్ణ కుమార్తెగా మీరు నడుం బిగించి బయటకు రావాలి.. మీ వెనుక నిలబడటానికి కోట్లాది మంది సిద్ధంగా ఉన్నారు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
సాంబశివరావు చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు.. సామాన్య నెటిజన్లు కొన్ని సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు. టీడీపీలో ఇప్పటికే నారా లోకేష్ యాక్టివ్గా ఉన్నారు. పాదయాత్రలు, ప్రజా పోరాటాలతో ఆయన తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అటు చంద్రబాబు, ఇటు లోకేష్ ఉండగా.. ఇప్పుడు బ్రాహ్మణి రావాల్సిన అవసరం ఏముందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.”ఎందుకు సాంబా.. పుసుక్కున ఇంత మాట అనేశావు? అంటే లోకేష్ చేతగానివాడనా? లేక ఆయన నాయకత్వంపై నీకు నమ్మకం లేదా?” అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఒక పక్క వారసత్వ రాజకీయాల గురించి చర్చ జరుగుతుంటే, మళ్ళీ అదే కుటుంబం నుంచి మరొకరిని రమ్మనడం ఏంటని కొందరు విమర్శిస్తున్నారు.నారా బ్రాహ్మణి ప్రస్తుతం హెరిటేజ్ ఫిన్ కార్ప్ బాధ్యతలను చూసుకుంటూ వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. గతంలో చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఆమె బయటకు వచ్చి గళం విప్పినప్పటికీ, అది కేవలం ఆ సందర్భానికే పరిమితమని ఆమె స్పష్టం చేశారు. తనకు రాజకీయాల కంటే వ్యాపారం, సామాజిక సేవా కార్యక్రమాలపైనే ఆసక్తి ఉందని ఆమె పలుమార్లు వెల్లడించారు.
ఒక సీనియర్ యాంకర్ ఇలా బహిరంగంగా ఒకరిని రాజకీయాల్లోకి రావాలని కోరడం, అది కూడా పార్టీలో కీలక నాయకులు ఉండగా ఇలా అనడం వెనుక అసలు అంతర్యం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయమా లేక దీని వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అనేది వేచి చూడాలి.
https://x.com/DrPradeepChinta/status/2012870438406201825?s=20

