సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో ఒకరు యాంకర్ అనసూయ. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తుండడమే కాదు, సమాజం లో జరిగే కొన్ని అంశాలపై ఆమె తన అభిప్రాయాన్ని వినిపిస్తూ ఉంటుంది. ఆ అభిప్రాయాలను అత్యధిక శాతం మంది నెటిజెన్స్ వ్యతిరేకిస్తూ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అందుకు అనసూయ మనసు నొచ్చుకోవడం, పోలీసులకు కంప్లైంట్ చేయడం వంటివి చేస్తూ ఉంటుంది.
మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి..సబ్ స్క్రైబ్ చేయండి.. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి
ఇక వార్తలోకి వెళితే..
రీసెంట్ గానే హీరో శివాజీ హీరోయిన్స్ వేసుకునే దుస్తులపై వ్యాఖ్యలు చేయడం, దానికి అనసూయ కౌంటర్ ఇస్తూ మాట్లాడిన మాటలు బాగా ట్రోల్ అవ్వడం వంటివి జరిగాయి. ఆ సమయం లో ఆమెపై ట్రోల్స్ వేసిన 75 మంది నెటిజెన్స్ పై అనసూయ కేసులు వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇలా సోషల్ మీడియా లో ఆమెని అత్యధిక శాతం నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తూ ఉంటారు.
కానీ ఆమెన్ దేవత లాగా పూజించే అభిమానులు కూడా ఉన్నారని నిన్ననే తెలిసింది. అనసూయ కి గుడి కట్టడానికి ప్రయత్నం చేస్తున్నామని , ఆమె వీరాభిమాని, పూజారి మురళి శర్మ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి, అదే విధంగా అనసూయ నుండి అనుమతి తీసుకుంటామని ఆయన రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. తమిళనాడు లో ప్రముఖ హీరోయిన్ కుష్బూ కి అప్పట్లో ఎలా అయితే అభిమానులు గురి కట్టారో, అదే తరహాలో అనసూయ ఆలయాన్ని కూడా నిర్మిస్తామని చెప్పుకొచ్చాడు. అంతే కాదు రీసెంట్ గా జరిగిన శివాజీ, అనసూయ గొడవ వ్యవహారం లో కూడా అనసూయ కరెక్ట్ అంటూ మురళి శర్మ చెప్పుకొచ్చాడు. మరి మురళి శర్మ తీసుకున్న ఈ నిర్ణయం పై, ఆయన చేసిన వ్యాఖ్యలపై అనసూయ ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి.
మరోవైపు సోషల్ మీడియాలో మురళి శర్మ పై కూడా నెటిజెన్స్ ట్రోల్స్ వేస్తున్నారు. సినీ సెలబ్రిటీలపై ఇంత పిచ్చి ఎందుకు ?, వాళ్ళు మీకు ఏమి చేశారు?, కనీసం మీ ముఖం ఎలా ఉంటుందో కూడా వాళ్లకు తెలియదు, వాళ్ళ ఇంటికి వెళ్తే సెక్యూరిటీ తో బయటకు గెంటిస్తారు, అలాంటి సినీ సెలబ్రిటీల కోసం ఇంత అవసరమా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పోనీ దేశానికీ సేవ చేసే హీరోలు, హీరోయిన్లు కొంతమంది ఉన్నారు, అలాంటి వాళ్లకు గుడి కట్టినా ఒక అర్థం ఉంది, అనసూయ ఏమి చేసిందని ఆమెకు గుడి కడుతాను అంటూ మురళి శర్మ ముందుకు వచ్చాడు?, ఆ డబ్బులతో వందల మందికి అన్నం పెట్టొచ్చు, అనసూయ పేరుతో ఆ పని చెయ్యి, నీకు, ఆమెకు పుణ్యం దక్కుతుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


