Top Stories

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

 

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. చాలా రోజులు మీడియా ముందుకు వచ్చిన ఆయన రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేక వీడియో విడుదల చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. గత 37 ఏళ్లలో చైనా సాధించిన ప్రగతిని.. భారత్ ప్రస్తుత స్థితిని పోలుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మతపురమైన రాజకీయాలు పక్కన పెట్టి.. దేశాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడానికి అందరూ కృషి చేయాలని పాల్ పిలుపునిచ్చారు. పనిలో పనిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సైతం కీలక సూచనలు చేశారు. తమ్ముడు పవన్ అంటూ సంబోధిస్తూ కేఏ పాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ అంటూ వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మ పరిరక్షణ కోసం బలమైన వ్యవస్థ అవసరమని ఆయన అభిప్రాయపడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో ఆలయాల పర్యటన కూడా చేస్తున్నారు. అయితే చాలా రోజులకు మీడియా ముందుకు వచ్చారు కె ఏ పాల్. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి తాజాగా మాట్లాడారు. పనిలో పనిగా తిరుమల లడ్డూ వివాదంపై కూడా వ్యాఖ్యానాలు చేశారు కే ఏ పాల్.

పవన్ కళ్యాణ్ తమ్ముడూ.. ఊగిపోవడం కాదు.. ఇప్పటికైనా ప్రభువు మార్గంలో.. శాంతి మార్గంలో, సత్యమార్గంలో నడవాలంటూ కేఏ పాల్ ఇచ్చిన సలహా వైరల్ అవుతుంది. పనికిమాలిన చేష్టలు మాని.. దేశాభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు. తిరుమలలో లడ్డూ వివాదం పై స్పందిస్తూ.. తాను ముందుగా చెప్పినట్లుగానే అక్కడ ఎలాంటి కల్తీ జరగలేదని స్పష్టం చేశారు. లడ్డూ పేరుతో హిందూ, ముస్లిం, క్రైస్తవులను రెచ్చగొడుతున్నారని చెప్పారు. ప్రజాప్రతినిధులు చిల్లర డిబేట్ లు విడిచిపెట్టి.. నిరుద్యోగం, రైతుల సమస్యలు, పేదరికం వంటి వాస్తవ సమస్యలపై దృష్టి పెట్టాలని పాల్ సూచించారు. మరోవైపు ఇండియాను నంబర్ వన్ దేశంగా మార్చడమే తన లక్ష్యం అని కే ఏ పాల్ ప్రకటించారు. అందుకే ఫిబ్రవరి 22న చెన్నైలో ప్రపంచ శాంతి సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కే ఏ పాల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

https://x.com/KAPaulOfficial/status/2015704650679451803?s=20

Trending today

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’!

  అయనో ఎమ్మెల్యే. అదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు. అంతేకాదు… తిరుమల...

హోమంత్రి గారు..ఒక్కసారి ఇటు చూడండి..

బాధ్యత గల హోం మినిస్టర్ హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్...

మహిళపై జనసేన ఎమ్మెల్యే కీచకపర్వం

మహిళల పక్షాన పోరాడే నాయకుడిగా పేరున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

Topics

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’!

  అయనో ఎమ్మెల్యే. అదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు. అంతేకాదు… తిరుమల...

హోమంత్రి గారు..ఒక్కసారి ఇటు చూడండి..

బాధ్యత గల హోం మినిస్టర్ హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్...

మహిళపై జనసేన ఎమ్మెల్యే కీచకపర్వం

మహిళల పక్షాన పోరాడే నాయకుడిగా పేరున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

యెల్లో మీడియా ఆక్రందన… అరణ్య రోదన!

తెలుగు మీడియా రంగం రోజురోజుకీ విలువలు కోల్పోతుందా? లేక రాజకీయ ప్రయోజనాల...

దావోస్‌ దారి ఖర్చులూ రాలేదా ఫాఫం?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక...

చంద్రబాబు కోపం వస్తే ఎట్టా ఉంటుందో తెలుసా?

చంద్రబాబు నాయుడు అంటే క్రమశిక్షణ, స్పష్టత, వేగం అని టీడీపీ వాళ్లు...

Related Articles

Popular Categories