Top Stories

నా మీద ఇలా చేసిన వాళ్ల నాశనం కళ్లారా చూసాకే నేను చస్తాను

జబర్దస్త్ ద్వారా ప్రతి ఇంటికీ పరిచయమైన కమెడియన్ చలాకి చంటి ఇటీవల తన కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టాల గురించి ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగంగా స్పందించాడు. ఒకప్పుడు టీవీ, సినిమాల్లో బిజీగా గడిపిన చంటి, ఇప్పుడు తిరిగి జబర్దస్త్‌ ద్వారా రీ-ఎంట్రీ చేస్తున్న నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

చంటి మాట్లాడుతూ, “ఈ కాలంలో డబ్బు ఉంటేనే మనిషికి విలువ. డబ్బు లేకపోతే మనల్ని ఎవరూ పట్టించుకోరని నాకు ఇప్పుడర్థమైంది. డబ్బు ఉన్నప్పుడంతా నా చుట్టూ తిరిగేవారు, కానీ కష్టాలు వచ్చినప్పుడు పలకరించడానికే ముందుకు రాలేదు” అని ఆవేదన వ్యక్తం చేశాడు. కొంతమంది చేసిన దుష్ప్రచారాల వల్ల తనకు సినిమాల్లో వచ్చిన అవకాశాలు చేతులారా జారిపోయాయని, తనకి ఈగో ఎక్కువట, షూటింగులకు భారీ పారితోషికం డిమాండ్ చేస్తానటూ అపోహలు సృష్టించారని చెప్పాడు.

“సంబంధం లేని వివాదాల్లో, గొడవల్లో నన్ను లాగి, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల దగ్గర నాపై నెగటివ్ ఇమేజ్ క్రియేట్ చేశారు. దాంతో అవకాశాలు నెమ్మదిగా తగ్గిపోయాయి. నా మీద ఇలా చేసిన వాళ్ల నాశనం కళ్లారా చూసాకే నేను చస్తాను” అని చంటి భావోద్వేగంతో చెప్పిన మాటలు ఆయన మనసులో ఎంత నొప్పు దాచుకున్నారో చూపిస్తున్నాయి.

ప్రస్తుతం చలాకి చంటి చేతిలో ఉన్న పెద్ద ఆఫర్ జబర్దస్త్ షో ఒక్కటే. ఒకప్పుడు ఈటీవీ లో జరిగిన చాలా ఎంటర్‌టైన్‌మెంట్ షోలలో రెగ్యులర్‌ ఫేస్‌గా కనిపించిన చంటి, యాంకర్‌గా ‘నా షో.. నా ఇష్టం’, ‘ఢీ’ వంటి షోల్లో కూడా తనదైన స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. ఆ కాలంలో తన స్కిట్స్‌ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతమంది కమెడియన్లు ఇవాళ పెద్ద స్థాయికి చేరుకున్నా, చంటి మాత్రం తిరిగి తన స్థానాన్ని సంపాదించుకోవడానికి పోరాడుతున్నాడు.

చలాకి చంటి ఈ ఎమోషనల్‌ ఎపిసోడ్ ఒక సంగతిని గుర్తు చేస్తోంది – గ్లామర్‌ ప్రపంచంలో విజయం, ఓటములు క్షణాల్లో మారిపోతుంటాయి. అయినా కూడా, తనపై నమ్మకం పెట్టుకుని మళ్లీ జగదేకవీరుడిలా స్టేజ్ మీదకి వచ్చిన చంటి, మరోసారి ప్రేక్షకుల మన్ననలు పొందుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.

Trending today

గుంటూరులో అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తల దాడి

గుంటూరు: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ...

టీవీ5 సాంబ సార్.. ఇది మేమెప్పుడూ చూడలా?

సాధారణంగా న్యూస్ చానెల్స్‌లో డిబేట్స్ అంటే… ప్రజలకు సంబంధం ఉన్న బర్నింగ్...

ఆ ఎమ్మెల్యేల దుకాణం పెద్దది.. రాసలీలలు ఎన్నో?

రైల్వేకోడూరు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ 'రాసలీలల'...

కూటమి అపచారం.. వైఎస్సార్‌సీపీ పాప ప్రక్షాళన పూజలు

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కూటమి నేతలు చేసిన వ్యాఖ్యలు...

ఏపీలో ‘రెడ్డి’.. తెలంగాణలో ‘రావు’.. కులాల మద్దతేదీ?!

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో...

Topics

సత్యం ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి...

అరవ శ్రీధర్ ఎపిసోడ్ గుణపాఠం!

ప్రజాజీవితంలో ఉన్నవారు వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్తగా ఉండాలన్నదానికి తాజా ఉదాహరణ అరవ...

చంద్రబాబుకు టీవీ5 ‘సాంబన్న’ ఎలివేషన్స్

టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం, ఇప్పుడు రాజకీయ...

Related Articles

Popular Categories