సాధారణంగా న్యూస్ చానెల్స్‌లో డిబేట్స్ అంటే… ప్రజలకు సంబంధం ఉన్న బర్నింగ్ ఇష్యూస్, పాలనలో లోపాలు, ప్రజా సమస్యలపై చర్చలు ఉంటాయని ఆశిస్తారు. కానీ ఇటీవల టీవీ5 న్యూస్ లో జరిగిన ఒక డిబేట్ చూస్తే ఇది డిబేటా? లేక భజనా కార్యక్రమమా? అనే సందేహం కలగకమానదు.
టీవీ5 యాంకర్ సాంబశివరావు తన కార్యక్రమంలో, అదే చానెల్ చైర్మన్, బీఆర్ నాయుడు ఎంతలా కష్టపడుతున్నారో, టీవీ5ని పట్టించుకోవడం లేదంటూ, తెరపై తెగ డప్పు కొడుతూ పొగడ్తల వర్షం కురిపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నలు వేయాల్సిన వేదికపై, యాజమాన్య గొప్పతనాల గీతాలు వినిపించడం ప్రేక్షకులకు అసహనం కలిగించింది.
ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ కావడంతో, నెటిజన్లు గట్టిగానే స్పందిస్తున్నారు. “మీ చైర్మన్ గొప్పతనం మాకెందుకు అండీ?” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. డిబేట్ పేరుతో స్వయంస్తుతి చేయడం జర్నలిజమా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇంకా కొందరు వ్యంగ్యంగా “ఇంక్రిమెంట్ కావాలా నాయనా? ప్రమోషన్ కావాలంటే సార్‌ను డైరెక్ట్‌గా అడగాలి కానీ… పబ్లిక్‌లో ఇలా రుద్దుడేంటి?” అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
మీడియా అనేది ప్రజల గొంతుక. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది. అదే మీడియా వేదికపై యాజమాన్య భజన సాగితే, ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది. డిబేట్ అంటే చప్పట్ల కోసం కాదు.. సమాధానాల కోసం… ఈ విషయంలో టీవీ చానెల్స్, యాంకర్లు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నది నెటిజన్ల స్పష్టమైన సందేశం.


