గుంటూరు: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. శనివారం మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు కర్రలు, రాడ్లతో దాడి చేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటన గుంటూరులో టెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది.
కూటమి అపచారానికి వైఎస్సార్సీపీ పాప ప్రక్షాళన పూజలకు అంబటి రాంబాబు గోరంట్లకు వెళ్తుండగా, టీడీపీ గూండాలు ఆయన కారును అడ్డుకున్నారు. పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ, దాడి యత్నానికి ప్రేక్షకులుగా మారారు. దీనిపై ఆగ్రహం చెందిన అంబటి మాట్లాడుతూ, “చంద్రబాబు అరచకాలు సృష్టిస్తున్నారు. పోలీసులు టీడీపీ ఫ్లెక్సీలకు కాపలా కాస్తున్నారు. ప్లాన్ ప్రకారమే నాపై దాడి జరిగింది” అని మండిపడ్డారు.
ఇది మాత్రమే కాదు, శుక్రవారం పల్నాడు జిల్లా బోయపాలెంలో మాజీ మంత్రి విడదల రజినీపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. తిరుమల లడ్డూపై టీడీపీ విష ప్రచారాన్ని నిరసిస్తూ ఆమె గుడిలో పూజలు చేస్తుండగా, గుండాలు హల్చల్ సృష్టించి కారును ధ్వంసం చేయడానికి యత్నించారు. సీబీఐ విచారణలో లడ్డూలో జంతు కొవ్వు లేదని తేల్కపోయినా, టీడీపీ నేతలు రెచ్చిపోతూ వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు.
పోలీసుల తీరు, టీడీపీ గూండాయిజం పై వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఈ దాడులు ఆగకపోతే మరింత ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది.

