Top Stories

వైసీపీ అంటే ‘వైరల్’.. కూటమి అంటే ‘కామన్’?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం భాషా యుద్ధం తారస్థాయికి చేరింది. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోందని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ఒకే రకమైన మాటలకు ఇద్దరు వ్యక్తులపై రెండు వేర్వేరు చర్యలు ఉండటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

వైసీపీ నాయకులు ఆవేశంలోనో, కడుపు మంటతోనో ఒక మాట అంటే చాలు.. అది క్షణాల్లో వైరల్ అయిపోతోంది. పోలీసుల ఎంట్రీ, అరెస్టులు, నాన్-బెయిలబుల్ కేసులు.. ఇలా సీన్ సినిమా రేంజ్‌లో సాగిపోతోంది. “చట్టం తన పని తాను చేసుకుపోతోంది” అని అధికార వర్గాలు చెబుతుంటే, అది కేవలం ఒక వర్గానికేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మరోవైపు, కూటమి నాయకులు అంతకంటే ఘాటుగా మాట్లాడినా, సదరు మాటలు పక్కా ‘సుభాషితాలు’గా చెలామణి అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి నాయకుల మాటలు ప్రవచనాలుగా మారుతున్నాయా? వారిపై చర్యలు తీసుకోవడానికి చట్టానికి కళ్లు కనిపించడం లేదా? “అధికారంలో ఉన్నప్పుడు మాట ‘మంత్రం’ అవుతుంది.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట ‘నేరం’ అవుతుంది.” అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

తాజాగా ఒక వీడియో సాక్ష్యంగా బయటకు వచ్చినప్పటికీ, కూటమి పెద్దలు దానిపై స్పందించకపోవడం గమనార్హం. “న్యాయం అందరికీ సమానంగా ఉండాలి.. ఒకరికి ఒక రూలు, ఇంకొకరికి ఇంకో రూలా?” అని సామాన్య జనం అడుగుతున్నారు. ఈ వీడియో చూశాకైనా కూటమి పెద్దలు స్పందిస్తారో లేక “ఇవన్నీ రాజకీయ విమర్శలే” అని కొట్టిపారేస్తారో చూడాలి.

https://www.facebook.com/reel/1235884555158170

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories