Top Stories

అంబటి కుటుంబానికి జగన్ పరామర్శ..

తాడేపల్లి నివాసం నుంచి గుంటూరుకు బయల్దేరిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన వైసీపీ నేత అంబటి రాంబాబు నివాసాన్ని సందర్శించారు. గుంటూరులోని అంబటి నివాసానికి చేరుకున్న జగన్, దాడి కారణంగా జరిగిన నష్టాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్, వారి ధైర్యాన్ని నిలబెట్టేలా మాటలతో అండగా నిలిచారు. ఇలాంటి దాడులతో ప్రజాస్వామ్యాన్ని భయపెట్టలేరని స్పష్టం చేస్తూ, పార్టీ శ్రేణులు, నాయకులు మనోధైర్యం కోల్పోకుండా ప్రజల పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు.

తదనంతరం మీడియాతో మాట్లాడిన జగన్, రాష్ట్రంలో కూటమి పాలనలో జంగిల్‌ రాజ్‌ నడుస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి దాడులు, బెదిరింపులకు పాల్పడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రజలు ఈ అన్యాయాలను గమనిస్తున్నారని, తగిన సమయంలో సమాధానం ఇస్తారని అన్నారు.

వైసీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వం బాధ్యత వహించాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన పాలకులు, చట్టవ్యవస్థను నిర్వీర్యం చేస్తూ హింసకు ప్రోత్సాహం ఇస్తున్నారని ఆరోపించారు. అంబటి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.ఇక జగన్ రాకతో అంబటి రాంబాబు నివాసం కార్యకర్తలు ప్రజలతో కిక్కిరిసి జగన్ నామస్మరణతో దద్దరిల్లిపోయింది.

Trending today

జైల్లో అంబటి రాంబాబు పరిస్తితి ఇదీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు జైల్లో ఎదుర్కొంటున్న ఆరోగ్య...

తిరుమల లడ్డూ.. మళ్లీ అదే పాట

ఇటీవలి తిరుమల లడ్డూ వివాదంలో మరోసారి చంద్రబాబు నాయుడు రాజకీయ శైలిపై...

నాగబాబు పై పవన్ కళ్యాణ్ సీరియస్!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనలో అంతర్గత కదలికలు చర్చనీయాంశంగా మారాయి. కూటమి...

జగన్ వస్తున్నాడు.. ‘కూటమి’కి దబిడదిబిడే..

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం గుంటూరులో...

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారం...

Topics

అంబటి రాంబాబు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు...

ఇవి ‘కూటమి’ బూతులా? సూక్తులా? వైరల్ వీడియో

రాజకీయాల్లో విమర్శలు సహజం. ఆరోపణలు, ప్రతివిమర్శలు ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ ఇటీవలి...

వైసీపీ అంటే ‘వైరల్’.. కూటమి అంటే ‘కామన్’?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం భాషా యుద్ధం తారస్థాయికి చేరింది. అయితే ఇక్కడే...

Related Articles

Popular Categories