కమల్ హాసన్‌పై టీవీ5 యాంకర్ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కమల్ స్పందించడాన్ని సాంబశివరావు తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల పార్లమెంటులో కమల్ హాసన్ మాట్లాడుతూ.. “జగన్నాథ రథచక్రాలు కదులుతున్నాయి” అంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మద్దతుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీవీ5 యాంకర్ సాంబశివరావు లైవ్‌లోనే విరుచుకుపడ్డారు.
తమిళనాడుకు చెందిన కమల్ హాసన్‌కు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. సినిమాల్లో నష్టపోయి ఏమైనా డబ్బులు అవసరమై ఇలా మాట్లాడుతున్నారా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం మాటలు చెప్పడం కాదు… దమ్ముంటే ఏపీలో సొంతంగా పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.
సాంబశివరావు వ్యాఖ్యలకు మద్దతుగా యూకేలో నివసిస్తున్న ప్రముఖ డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత కూడా రంగంలోకి దిగారు. కమల్ హాసన్ వైఖరిని ఆయన తీవ్రంగా ఎండగట్టారు. “కమల్ హాసన్ ఒక జోకర్ అని తమిళ ప్రజలకు కూడా తెలియాలి. ఏమీ తెలియకుండా ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టడం సరికాదు.” అని ప్రదీప్ రెడ్డి మండిపడ్డారు.
కమల్ హాసన్ లాంటి అగ్ర నటుడిని, ఒక రాజకీయ పార్టీ అధినేతను ఉద్దేశించి “డబ్బులు కావాలా”, “జోకర్” వంటి పదజాలాన్ని వాడటంపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ మద్దతుదారులు కమల్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.ఈ వివాదంపై కమల్ హాసన్ లేదా ఆయన పార్టీ మక్కల్ నీది మయ్యంఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. తమిళులు మాత్రం టీవీ5 సాంబపై ఆగ్రహంగా ఉన్నారు.
https://x.com/DrPradeepChinta/status/2020996980814520643?s=20


