ఆంధ్రప్రదేశ్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు మధ్య ఉన్న బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది మృత్యువాత పడ్డట్లు సమాచారం.
పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసమైపోయింది. మృతదేహాలు దూరంగా ఎగిరిపడ్డాయని, ఘటన స్థలమంతా భయానకంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. భారీ మంటలు చెలరేగడంతో మరికొంతమంది లోపల చిక్కుకుని ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 15 మంది వరకు మంటల్లో చిక్కుకున్నట్లు స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బాణసంచా తయారీ సమయంలో భద్రతా నిబంధనలు పాటించలేదా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఈ విషాద ఘటనతో ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించే అవకాశం ఉంది.
https://x.com/TeluguScribe/status/2027684921180082668?s=20

