Top Stories

జగన్ ను శరణు కోరిన ‘ఎన్డీఏ’

కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీఏ సర్కారుకు ఆదిలోనే చెక్ పడింది. రాజ్యసభలో ఎన్డీఏ బలం తగ్గిపోయింది. తాజాగా నలుగురు ఎంపీల పదవీ కాలం ముగిసింది. ఇందులో నామినేటెడ్ ఎంపీలైన రాకేశ్ సిన్హా, మహేశ్ జెఠ్మాలనీ, రామ్ షకిల్, సోనాల్ మాన్ సింగ్ ఉన్నారు. శనివారం వీరి పదవీ కాలం ముగియడంతో రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 86కు చేరింది. మొత్తంగా 245 సభ్యులున్న రాజ్యసభలో మ్యాజిక్ ఫిగర్ 113గా ఉంది. అయితే మొత్తంగా ఎన్డీఏ కూలమి బలం ప్రస్తుతం 101కి చేరింది.

ఇండియా కూటమి బలం ఎంతంటే..

రాజ్యసభలో ఇండియా కూటమికి 87 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో కాంగ్రెస్ కు 26, తృణమూల్ కాంగ్రెస్ కు 13 మంది సభ్యులు ఉన్నారు. ఇక ఆమ్ ఆద్మీ, డీఎంకే పార్టీలకు 10 మంది చొప్పున సభ్యులు ఉన్నారు. అయితే ఇటు ఇండియా, అటు ఎన్డీఏ కూటమిలో లేని సభ్యులు ఇప్పుడు కీలక బిల్లుల పాస్ లో కీలకం కాబోతున్నారు. వీరిపై ఇప్పుడు రెండు కూటములు దృష్టి పెట్టాయి. ఎన్డీయేతర పార్టీలపై ఇప్పుడు మోదీ సర్కారు దృష్టి పడింది. ఇందులో అన్నాడీఎంకే, వైఎస్సార్సీపీ పార్టీలు కీలకంగా ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో 20 ఎంపీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 11 స్థానాలకు ఏడాదిలో ఎన్నికలు జరగాల్సి ఉంది.

వైఎస్సార్సీపీకి 11 మంది సభ్యులు..

రాజ్యసభలో నాలుగో అతి పెద్ద పార్టీగా వైఎస్సార్సీపీ ఉంది. ఈ పార్టీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. ఇక బిల్లులను ఆమోదించుకునే సమయంలో ఇప్పుడు వైఎస్సార్సీసీ మద్దతు చాలా అవసరం. ఇక అన్నాడీఎంకే కు నలుగురు సభ్యులు ఉన్నారు. అయితే ఇప్పుడు వైఎస్సార్సీపీ అధినేత జగన్ తీసుకునే నిర్ణయమే కీలకంగా మారబోతున్నది. మరోవైపు ఎన్నికలకు ముందు తెగదెంపులు చేసుకున్న బీజేడీ ఎన్డీఏకు ఇక తమ మద్దతు ఉండబోదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది. గతంలో బిల్లుల ఆమోదం విషయంలో వైఎస్సార్సీపీ ఎన్డీఏకు సంపూర్ణంగా సహకరించింది. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్సీపీ మద్దతునిస్తుందా.. లేదా అనేది కీలకంగా మారింది. మరోవైపు తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎంపీల మద్దతు కూడా ఎన్డీఏకు అవసరమవుతుంది. ఇక ఎన్డీఏ కూటమిలో ప్రస్తుతం ఏపీ నుంచి టీడీపీ కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆ కూటమికి మద్దతునిస్తారా అనేది కీలకం కాబోతున్నది. ఇప్పటికే ఇండియా కూటమి నేతలు మాజీ సీఎం జగన్ తో టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఆయనను ఇండియా కూటమికి ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక జగన్ ఇండియా కూటమిలో చేరితే రాజ్యసభలో ఎన్డీఏకు ఇబ్బందికర పరిస్థితే ఎదురవుతుంది. అయితే వైఎస్ జగన్ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా వెళ్లే సాహసం చేస్తారా.. ప్రస్తుతానికి మద్దతునిస్తారా అనేది త్వరలోనే నిర్వహించే బడ్జెట్ సమావేశాల్లో తేలిపోనుంది.

Trending today

బాబు కూల్చిన ‘అమరావతి’ కథ

అమరావతిలో అభివృద్ధి పేరిట మరో సారి వివాదం చెలరేగింది. ప్రముఖ రియల్...

చంద్రబాబు, లోకేశ్‌ ల ఆర్గనైజ్డ్‌గా క్రైమ్‌

విజయవాడలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ నకిలీ...

ఎర్రబుక్ రాజ్యాంగంలో ఇంతే

కాకినాడ జిల్లా తునిలో జరిగిన మైనర్ బాలిక అత్యాచార ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా...

కష్టం జగన్ ది.. ప్రచారం బాబు ది

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి క్రెడిట్ యుద్ధం చెలరేగింది. విశాఖపట్నం సమీపంలోని భోగాపురం...

హైదరాబాద్ పబ్‌ల్లో ఏపీ మంత్రులు..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు వినిపించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

Topics

బాబు కూల్చిన ‘అమరావతి’ కథ

అమరావతిలో అభివృద్ధి పేరిట మరో సారి వివాదం చెలరేగింది. ప్రముఖ రియల్...

చంద్రబాబు, లోకేశ్‌ ల ఆర్గనైజ్డ్‌గా క్రైమ్‌

విజయవాడలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ నకిలీ...

ఎర్రబుక్ రాజ్యాంగంలో ఇంతే

కాకినాడ జిల్లా తునిలో జరిగిన మైనర్ బాలిక అత్యాచార ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా...

కష్టం జగన్ ది.. ప్రచారం బాబు ది

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి క్రెడిట్ యుద్ధం చెలరేగింది. విశాఖపట్నం సమీపంలోని భోగాపురం...

హైదరాబాద్ పబ్‌ల్లో ఏపీ మంత్రులు..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు వినిపించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

8వ తరగతి బాలికను తోటలోకి తీసుకెళ్లి దొరికిన టిడిపి నేత

కాకినాడ జిల్లా తుని పరిసరాల్లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక...

ABN వెంకటకృష్ణ మనసులో మాట..

ఆంధ్రజ్యోతి చానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న వెంకటకృష్ణ తన ‘మనసులో మాట’ ద్వారా...

ఉలిక్కిపడ్డ టీడీపీ మీడియా!!

గూగుల్ డేటా సెంటర్ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అమెరికాలో ఇప్పటికే...

Related Articles

Popular Categories